వీకెండ్ పార్టీ : వివాదంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ

By Bojja Kumar

హైదరాబాద్: హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇటీవల 'శ్రీమన్నారాయణ' ఆడియో ఫంక్షన్లో తండ్రితో కలిసి పత్యక్షమై వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్లో మోక్షజ్ఞ తెరంగ్రేటం గురించి చర్చ మొదలైంది.

ఆ సంగతి అలా ఉంచితే.... మోక్షజ్ఞ తాజాగా ఎవరూ ఊహించని కారణాలతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. మోక్షజ్ఞ ప్రయాణిస్తున్న టాటా సఫారి కారును బంజారా హిల్స్ పోలీసులు సీజ్ చేసారు. వీకెండ్ పార్టీ పూర్తి చేసుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.... మోక్షజ్ఞ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో పాల్గొని ఆదివారం రాత్రి(ఆగస్టు 19)న బంజారా హిల్స్ రోడ్ నెం.12 వైపు వస్తుండగా, విధి నిర్వహణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు కాపు కాసుకుని ఉన్నారు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని పోలీసులు పట్టకున్నారు.

వివరాల ప్రకారం...టాటా సఫారి వెహికిల్‌(AP 16 BK 1)ని ట్రాఫిక్ ఎస్ఐ బాలకృష్ణారెడ్డి పట్టుకుని దాన్ని డ్రైవ్ చేస్తున్న వెంకట్ సుధాకర్ పేరుపై కేసు రిజిస్టర్ చేసారు. దీంతో మోక్షజ్ఞ, అతని స్నేహితులు వేరే వెహికిల్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు మీడియాను అవాయిడ్ చేసి వేరే వాహనం రాగానే వెళ్లి పోయారు.

కాగా...వెంకట్ సుధాకర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా 30 mg పరిమితిని మించి 77 mg ఆల్కహాల్ మోతాదు అతని రక్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతనిపై మోటార్ వెహికిల్ చట్టంలోని నిబంధనల మేరకు సెక్షన్ 185(a) ప్రకారం కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసారు.

బాలయ్య ఇటీవల మోక్షజ్ఞను 'శ్రీమన్నారాయణ' ఆడియో వేడుకకు తీసుకురాగా ఇదంతా అతనికి పబ్లిసిటీ పెంచడంలో భాగంగానే అని అంతా అనుకున్నారు. కానీ వీకెండ్ పార్టీ సంఘటనతో మెక్షజ్ఞ తనకు తానుగా బ్యాడ్ పబ్లిసిటీ సొంతం చేసుకున్నాడు. మోక్షజ్ఞ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో ఏ పానీయం తీసుకున్నారు? అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X