దాసరి దర్సకత్వంలో నటించడం అదృష్టం: బాలయ్య
హైదరాబాద్: దాసరి నారాయణరావు దర్సకత్వంలో నటించడం తన అదృష్టమని బాలకృష్ణ అన్నారు. బాలయ్య తన 50వ జన్మదినాన్ని హైదరాబాదులో అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందదర్భంగా దాసరి దర్శకత్వంలో బాలయ్య హీరోగా పరమవీర చక్ర సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. దాసరి దర్శకత్వంలో నటించాలనే కోరిక ఇన్నాళ్లకు తీరుతోందని ఆయన అన్నారు. బెబ్బులిపులి, సర్దార్ పాపరాయుడి వంటి హిట్ సినిమాలను రామారావుకు అందించిన దాసరి దర్శకత్వంలో నటించాలని కోరికగా ఉండేదని, ఆ కోరిక ఇప్పుడు తీరుతోందని, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన అన్నారు.
సినీ పరిశ్రమ ఒక్కటేనని, తెలుగు చిత్ర పరిశ్రమకు దాసరి పెద్ద దిక్కు అని ఆయన అన్నారు. దాసరి అండదండలతోనే తాను వరద సహాయ నిధి సేకరణకు కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అభిమానుల అభిమానమే తనకు శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. అభిమానుల నమ్మకాన్ని తాను వమ్ము చేయబోనని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











