గుంటూరులో ‘మగధీర’ కలెక్షన్ రికార్డును బ్రేక్ చేసిన ‘సింహా’
నటసింహా బాలకృష్ణ హీరోగా రూపొందిన 'సింహా" చిత్రం ఇటీవల 50రోజులు 338 సెంటర్స్ లో పూర్తి చేసుకుని 100 రోజుల వైపు పరుగులు పెడుతోంది. గుంటూరులో అయితే ఏకంగా 'మగధీర" సినిమా రికార్డులను క్రాస్ చేసేసిందని సమాచారం. ట్రేడ్ వర్గాల లెక్కలు ప్రకారం కేవలం గుంటూరులో మాత్రం 5 కోట్లు 'సింహా" కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ కలెక్షన్ 'మగధీర", 'యమదొంగ" సినిమాల వసూళ్ళను దాటేసిందని కూడా తెలుస్తోంది. సో..గుంటూరు కు సంబంధించినంత వరకూ 'సింహా" కొత్త రికార్డులు నెలకొల్సిందని సమాచారం. ఈ సందర్భంగా నందమూరి నటసింహానికి శుభాకాంక్షలు తెలిజేద్దాం.
More from Filmibeat
బాలకృష్ణ సింహా మగధీర రామ్ చరణ్ తేజ్ యమదొంగ జూ ఎన్టీఆర్ balakrishna simha magadheera ram charan teja yamadonga jr ntr


Click it and Unblock the Notifications











