బాలయ్యతో వైయస్ జగన్ సినిమా?
బాలకృష్ణ 'పాండురంగడు' సినిమా తర్వాత ఇంకా యే సినిమాని ఒప్పుకున్నట్లు తెలియటం లేదు.ఆయనతో సినిమా చేస్తాడని అనుకున్న దర్శకుడు మహదేవన్ ఇప్పుడు ప్రభాస్ ని 'రాజు' గా తీర్చిదిద్దుతున్నాడు. అలాగే బోయపాటి శ్రీను..గోపీచంద్ తో సినిమా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు బాలయ్య లేటెస్ట్ సినిమాని 'పందెంకోడి','రన్' వంటి సినిమాలతో పాపులర్ అయిన యాక్షన్ ఫిల్మ్స్ డైరక్టర్ లింగుస్వామితో చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో జోరుగా వార్తలు వినపడుతున్నాయి.
అలాగే కడప మేయర్ రవీంద్రారెడ్డి ఈ ప్రాజెక్టుని చేబట్టనున్నారని తెలుస్తోంది.హరీష్ జయరాజ్ సంగీతం వహిస్తారని...అంటున్నారు.అలాగే ముఖ్యమంత్రి కుమారుడు వై.యస్.జగన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తారని వినపడుతోంది.ఇక జగన్ గతంలో కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘానికి అధ్యక్షుడుగా చేసిన సంగతి తెలిసిందే.దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.త్వరలోనే ఈ ప్రాజెక్టు మెటీరిలైజ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











