»   » బాలకృష్ణ కోసం పరితపిస్తున్న నమిత!

బాలకృష్ణ కోసం పరితపిస్తున్న నమిత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన భారీ అందాలతో మత్తెక్కించే నమిత, తనకు కూడ మత్తెక్కించే మగాడు కనిపించాడని చెబుతుంది. ఇంతకీ ఆ మగాడు ఎవరనుకుంటున్నారు..నటసింహం నందమూరి బాలకృష్ణ ఆయనతో చేస్తుంటే అసలు నమితకు లోకమే తెలియడం లేదట. ఎంతమంది యంగ్ హీరోలతో చేసినా ఆ మజా రాదంటుంది..నమిత..బాలకృష్ణ హీరోగా నటిస్తున్న'సింహా" చిత్రంలో రెండవ హీరోయిన్ గా నమిత నటిస్తున్న విషయం తెలిసిందే. బిల్లా చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రం పై నమిత ఎన్నో ఆశలు పెట్టుకుంది...అందుకే ఈ చిత్రంలో కూడా ఎంతో అందంగా అందాలను ప్రదర్శించిందని సమాచారం.

ఈ సందర్బంగా బాలయ్యను పదే పదే పొగడ్తల్లో ముంచెత్తేస్తోంది. ఇప్పటికీ యంగ్ హీరోలాగా ఆయన కష్టపడటం చూస్తే ఎంతో ముద్దోస్తుంది, కుర్ర హీరోలతో పోటీ పడే రొమాంటిక్ లుక్ బాలయ్య సొంతమని అంటోంది భారీ అందాల భామ నమిత. ఈ సినిమాలో బాలయ్య సరసన తాను పెర్ ఫెక్ట్ గా సూటయ్యానని చెప్పుకుంటోన్న నమిత, స్నేహ ఉల్లాల్ మంచి కో-స్టార్ అని కితాబులిస్తోంది. అలాగే ఆయన ఎంతో చక్కగా పలకరిస్తాడు..షూటింగ్ స్పాట్ కు వెళ్లగానే ముందు ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది అంటుంది నమిత.మరి అంతగా బాలయ్యలో ఏం నచ్చిందో కానీ మాట్టాడితే చాలు..బాలయ్య అంటూ కలవరిస్తుందట నమిత అంతేలే పాపం చివరి ఛాన్స్ కదా!ఆ మాత్రం అవసంరం అంటున్నారు..విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X