హాట్ టాపిక్‌గా మారిన బాలయ్య విగ్గు!
నందమూరి హీరో బాలయ్య విగ్గు పెట్టుకుని సినిమాల్లో నటిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా సినిమాకు విలక్షణమైన విగ్గుతో అసలు...అది విగ్గు అనే అనుమానం ఏ మాత్రం రాకుండా కరవ్ చేయడం నందమూరి బాలయ్యకే చెల్లింది. అసలు విగ్గు లేకున్నా బాలయ్య హ్యాండ్ సమ్ గా ఉంటారు అనేది చాలా మంది అభిమానుల అభిప్రాయం. సినిమాల్లో తప్పదు కాబట్టి విగ్గు ధరించాల్సిందే. తాజాగా బాలయ్య 'అధినాయకుడు' సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో బాలయ్య మూడు విభిన్నమైన పాత్రలు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా, మరొకటి తాత పాత్ర, మరొకటి యువడి పాత్ర. ఈ సినిమా స్టిల్స్ చూస్తుంటే బాలయ్య ఈ మూడు పాత్రల్లో సూపర్ గా ఇమిడి పోయాడు అనే ప్రశంసలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అయితే బాలయ్య ఈ సినిమాలో పోషించిన యువకుడి పాత్రలో వాడిన విగ్గు మాత్రం ఆయనకు సెట్ కాలేదనే వాదన కొందరి నుంచి వినిపిస్తోంది. ఆమధ్య వచ్చిన బాలయ్య ప్లాపు సినిమా 'మిత్రుడు' గెటప్ ను పోలి ఉందని, బాలయ్య ఈ విషయం కొంత జాగ్రత తీసుకుని ఉంటే బాగుండేది అనే వాదన వినిపిస్తోంది. కేవలం ఇది సినిమా స్టిల్స్ చూసి వస్తున్న అభిప్రాయాలు మాత్రమే, మరి సినిమాలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు అనేది ఆ సినిమా థియేటర్లోకి వస్తేగానీ తెలీదు.
అధినాయకుడు సినిమాకు పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తుండగా ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. సలోని, లక్ష్మిరాయ్ లీడర్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. జయసుధ ముఖ్య పాత్రలో కనిపించనుంది. జనవరి 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.


Click it and Unblock the Notifications











