అవి రామకృష్ణులు సినిమా (1978) జరుగుతున్న రోజులు. అందులో అక్కినేని,ఎన్టీఆర్ హీరోలు. సత్యనారాయణ విలన్ . మల్టీ స్టార్స్ తో చేస్తున్న సినిమా అని భారి బడ్జెట్ (40 లక్షలు) తో రంగంలోకి దిగారు. క్లైమాక్స్ పెద్ద ఫైట్ ప్లా న్ చేసారు. అదీ బెలూన్ లో...జరిగేలా... రిస్క్ ...ఖర్చు అయినా వెనకాడేది లేదని...50 వేలు ఖర్చు పెట్టి బెలూన్ చేయించారు దర్శక,నిర్మాతలు. అందులోనూ వారి ముగ్గురూ (హీరో లిద్దరూ,విలన్ ) బరువులూ లెక్క వేసి మరీ దానికి తగినట్లుగా తయారుచేయించారు. అనుకున్న రోజున అనుకున్న సమయానికి షూటింగ్ స్టార్ట్ అయింది. అంతా ఉత్సాహంగా ఉన్నారు. కాని అప్పుడు మెదలైంది అసలు ప్లాబ్లం...బెలూన్ గాలిలోకి ఎగరటం లేదు. ఎవరికీ ఏమీ అర్ధం కావటం లేదు. అన్ని రకాలుగా చెక్ చేసారు. ఫలితం లేదు. అప్పుడు వారిలో ఒకరికి బల్బు వెలిగిందిట. ఆ ముగ్గురూ కాన్వాయ్ బూట్లు వేసుకున్నారు. వాటి బరువు మెదట లెక్కవేయలేదు.అందుకని ఆ బరువు ఎక్కువై బెలూన్ ఎగరలేదు. మనం తెరపై చూసేవి చాలా ఈజీగా ఉంటాయి...కాని ఏ మాత్రం లెక్క తప్పినా బెలూన్ గాలి తీసినట్లు అయిపోతుంది. అదీ సంగతి.