twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బలుపు' ఆడియో హైదరాబాద్ లో కాదు

    By Srikanya
    |

    హైదరాబాద్: రవితేజ.... త్వరలో 'బలుపు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్‌ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. వచ్చే నెలలో పాటల విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తారు. సినీ ప్రముఖుల సమక్షంలో భారీ హంగామాతో చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు

    ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమాలు వికారాబాద్‌ పరిసరాల్లో సాగుతున్నాయి. హీరో, విలన్ బృందం మధ్య పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. నలుగురిలో నెగ్గుకు రావాలంటే బలంతోపాటు బలుపు కూడా ఉండి తీరాల్సిందే అన్నది ఆ యువకుడి సిద్ధాంతం. అతగాడు ఎవరిపై గెలుపు పతాకం ఎగుర వేశాడో 'బలుపు' చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు కథ గురించి దర్శకుడు.

    రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌, అంజలి హీరోయిన్స్ . వీర సినిమా దగ్గర నుంచి రవితేజ సినిమాలన్నీప్లాపులే. దీంతో రవితేజ సినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే విషయం గ్రహించిన రవితేజ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

    ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. 'దూకుడు' సినిమాతో పాటు పలు చిత్రాలకు అదిరిపోయే స్క్రిప్టు అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన స్క్రిప్టు అందించబోతున్నాడు. ఈ సారి రవితేజకు హిట్టు ఖాయమనే ధీమా ఆ చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పరమ్‌ వి.పొట్లూరి నిర్మాత. కథ: కోన వెంకట్‌, బాబి, సంగీతం: తమన్‌, సమర్పణ: ప్రసాద్‌ వి.పొట్లూరి.

    English summary
    Audio release of Ravi Teja-starrer Balupu, the makers have surprised everyone with their move. The film's director Gopichand Malineni said that the unit is planning to roll out the audio in Vijayawada in April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X