రవితేజ ‘బలుపు’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్ : రవితేజ కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై నిర్మిస్తున్న 'బలుపు' చిత్రం నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రం చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు బాగుందని ప్రసంశించినట్లు సమాచారం.
ఈనెల 28న 'బలుపు' చిత్రాన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు నిర్మాతలు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. నిర్మాత పరమ్ వి.పొట్లూరి మాట్లాడుతూ- ఇటీవల విడుదల పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 28న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
తమ సంస్థకు ఓ మంచి హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని నమ్మకం ఉందని, శృతిహాసన్, అంజలి గ్లామర్, నటన ఈ చిత్రానికి హైలెట్స్‌గా ఉంటాయని, లక్ష్మీరాయ్ అతిథిగా నటించడం ఈ చిత్రానికి మరో స్పెషల్‌గా మారిందని తెలిపారు. కోన వెంకట్ అందించిన కథతో దర్శకుడు అద్భుతమైన చిత్రాన్ని తీర్చిదిద్దారని, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని తెలిపారు.
ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావూ రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ వినె్సంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.


Click it and Unblock the Notifications












