twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘బలుపు’ రిలీజ్ డేట్...ఇదే ఫైనల్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రవితేజ కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై నిర్మిస్తున్న 'బలుపు' చిత్రం విడుదల ఎట్టకేలకు ఫైనల్ అయింది. ఇంతకు ముందు ఈచిత్రాన్ని జూన్ రెండో వారం లేదా మూడో వారంలో విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్లు వేరే సినిమాలకు ఖరారుకావడంతో.... ఈనెల 28న 'బలుపు' చిత్రాన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

    గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. నిర్మాత పరమ్ వి.పొట్లూరి మాట్లాడుతూ- ఇటీవల విడుదల పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించనున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 28న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

    తమ సంస్థకు ఓ మంచి హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని నమ్మకం ఉందని, శృతిహాసన్, అంజలి గ్లామర్, నటన ఈ చిత్రానికి హైలెట్స్‌గా ఉంటాయని, లక్ష్మీరాయ్ అతిథిగా నటించడం ఈ చిత్రానికి మరో స్పెషల్‌గా మారిందని తెలిపారు. కోన వెంకట్ అందించిన కథతో దర్శకుడు అద్భుతమైన చిత్రాన్ని తీర్చిదిద్దారని, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని తెలిపారు.

    ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావూ రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ వినె్సంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.

    English summary
    Balupu movie will be releasing on June 28. The official announcement came from the producers. Malineni Gopichand directing this film. Thaman scoring the music. A song sung by Raviteja completely in this movie as per the sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X