twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘బలుపు’ ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈచిత్రం 2013 మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం ఫస్ట్ లుక్‌ను రవితేజ బర్త్ డే ను పురస్కరించుకుని జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    వైజాగ్ బ్యాక్ డ్రాప్‍‌తో సాగే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత రవితేజ పూర్తి మాస్ రోల్ చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు.

    రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే... శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది. మరో హీరోయిన్ అంజలి మెడికో పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాని తమన్ సంగీతం అందిస్తున్నారు.

    2012 సంవత్సరం మొత్తం వరుస ప్లాపు సినిమాలతోనే కెరీర్ లాగించాడు. మాస్ అప్పియరెన్స్ రొటీన్ అయిపోయిందని...ఇటీవల 'సారొచ్చారు' సినిమాలో క్లాస్ అప్పీయరెన్స్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేక పోయింది. ఇలా వరుస ప్లాపుల నేపథ్యంలో....మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, 2013 సంవత్సరంలోనైనా హిట్ సినిమాతో కెరీర్ ప్రారంభించాలని కమిట్ మెంట్ తో ఉన్నాడు రవితేజ.

    English summary
    Ravi Teja’s upcoming movie 'Balupu', to be directed by Gopichand Malineni, first look to be officially unveiled on January 26, which happens to be Ravi Teja’s birthday. Kona Venkat is providing script and as per a source, the movie will score a sure shot hit as the ace writer offered a full length commercial script for his favorite hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X