రవితేజ ‘బలుపు’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్ : రవితేజ, శృతి హాసన్, అంజలి హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బలుపు'. పివిపి సినిమా బేనర్‌పై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈచిత్రం ఆడియో జూన్ 1 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్ లో ని HICCలో ఈ ఆడియో పంక్షన్ జరగనుంది. అలాగే జూన్ చివరి వారంలో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుండగా, లక్ష్మి రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.
తాజాగా ఈచిత్రం ఆడియో ట్రాక్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇందులో రెండు పాటల్లో హీరో రవితేజ తన స్వరం కలపడం విశేషం. అందుకు సంబంధించిన వివరాలు..
1. కాజల్ చెల్లివా...
గానం : రవితేజ, ఎస్ఎస్ తమన్
రచన : భాస్కర భట్ల
2. యేవైందో...
గానం : ఎస్.పి. బాలు, గీతా మాధురి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
3. లక్కీ లక్కీ రాయ్
గానం : నవీన్ మాధవ్, ఎంఎం మానసి
రచన : భాస్కర భట్ల
4. పడిపోయానిలా...
గానం : సుచిత్ సురేశన్, మేఘ
రచన : అనంత శ్రీరామ్
5. పాతికేళ్ల సుందరి..
గానం : మికా సింగ్, రానినా
రచన : భాస్కర భట్ల
6. హలో బాయ్స్ అండ్ గర్ల్స్
గానం : రవితేజ
రచన : భాస్కర భట్ల
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.


Click it and Unblock the Notifications











