మళ్ళీ..ప్రకాష్ రాజ్ బ్యాన్ ఇష్యూ

'ఎన్నో ఏళ్ల నుండి చిన్న నిర్మాతలు తమ బాధలు చెప్పుకుంటున్నా మీరు ఏ మాత్రం న్యాయం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి. నిర్మాతలమండలి అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మండలి సభ్యుడైన జ్యోతిప్రసాద్ వ్యవహారంలో నటుడు ప్రకాశరాజ్‌తో ఒక సెటిల్‌మెంట్ చేసిన మీరు అతను పూర్తి డబ్బు చెల్లించకుండానే అతనిపై ఉన్న బ్యాన్‌ని ఎత్తి వేశారు. దీని వల్ల జ్యోతిప్రసాద్ ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి మీకు ఇతరుల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? మీ లోపాలను ఎవరు ప్రశ్నిస్తారో అని భయపడి పదవికి రాజీనామా ఇచ్చారు. అసలు మీరు అధ్యక్షపదవికి అనర్హులని మేమంతా అంటున్నాం' అంటూ ఆ ప్రకటనలో తీవ్ర విమర్శ చేశారు. అలాగే భరద్వాజ ఇలా పేర్కొనడం ఆయన పెద్దరికాన్ని కించపరిచే విధంగా ఉందని ఆయనపై ధ్వజమెత్తారు.అయితే నిరాహార దీక్ష విరమణతో అంతా ఒకటయ్యారు.


Click it and Unblock the Notifications











