ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న 10 టాలీవుడ్ రికార్డులు: ‘భరత్ ఎన్ని బద్దలు కొట్టబోతున్నాడు?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కనీ వినీ ఎరుగని రీతిలో ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 20న సినిమా విడుదలవుతుండగా యూఎస్ఏలో ఒక రోజు ముందే 2వేల ప్రీమియర్ షోలు వేస్తున్నారంటే సినిమా ఏరేంజిలో రిలీజ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు మహేష్ బాబు-కొరటాల లాంటి హిట్ కాంబినేషన్ కావడం, సూపర్ స్టార్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్న తొలి పొలిటికల్ ఎంటర్టెనర్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.

200 కోట్ల మార్కును అందుకోబోయే తొలి చిత్రం ఇదేనా?
ఇప్పటి వరకు బాహుబలి తప్ప నాన్ బాహుబలి సినిమాలు తెలుగులో రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అందుకోలేదు. ఈ రికార్డును అందుకోగల సత్తా ఉన్న సినిమా ‘భరత్ అనే నేను' సినిమా అని అంటున్నారు. రిలీజ్ కూడా అదే స్థాయిలో ఉండటంతో సినిమా హిట్ టాక్ వస్తే ఈజీగా రూ. 200 కోట్ల మార్కును ఈ చిత్రం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

అభిమానులను ఊరిస్తున్న 10 నాన్ బాహుబలి రికార్డులు
నాన్ బాహుబలి కేటగిరీలో మొత్తం 10 రికార్డులు అభిమానులను ఊరిస్తున్నాయి. తప్పకుండా ఈ సారి తమ హీరో చిత్రం 10 రికార్డులను అందుకోవడం ఖాయం అనే ధీమాతో ఉన్నారు. ఈ చిత్రం తమను కాలర్ ఎగరేసుకునేలా చేస్తుందని నమ్ముతున్నారు.

ఆ రికార్డులు ఇవే...భరత్ ఎన్ని బద్దలు కొడతాడో?
1. యూఎస్ఏ ప్రీమియర్స్ హయ్యెస్ట్ గ్రాస్: అజ్ఞాతవాసి ($1,514,000)
2. బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ వరల్డ్ వైడ్ మార్కెట్: అజ్ఞాతవాసి (రూ. 60.50 కోట్లు)
3. ఓపెనింగ్ వీకెండ్ హయ్యెస్ట్ గ్రాసర్: ఖైదీ నెం.150 (రూ. 95.40 కోట్లు)
4. ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల గ్రాస్ : ఖైదీ నెం. 150 (6రోజుల్లో)
5. ఫాస్టెస్ట్ $2 మిలియన్ డాలర్ యూఎస్ఏ గ్రాసర్: ఖైదీ నెం. 150( 6 రోజుల్లో)
6. హయ్యెస్ట్ గ్రాసర్ యూఎస్ఏ : రంగస్థలం ($3.38 మిలియన్ నేటి వరకు)
7. హయ్యెస్ట్ గ్రాసర్ ఓవర్సీస్ మార్కెట్: రంగస్థలం( రూ. 30 కోట్లు ఇప్పటి వరకు..)
8. హయ్యెస్ట్ గ్రాసర్ ఇన్ తెలుగు స్టేట్స్: రంగస్థలం (రూ. 125 కోట్లు ఇప్పటి వరకు)
9. హయ్యెస్ట్ గ్రాసర్ ఇన్ గ్లోబల్ మార్కెట్: రంగస్థలం (రూ. 182 కోట్లు ఇప్పటి వరకు)
10. రూ. 200 కోట్ల గ్రాసర్..... (నాన్ బాహుబలి కేటగిరీలో ఇప్పటి వరకు ఏదీ లేదు)

టికెట్స్ అన్నీ ఖాళీ
ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ సోమవారమే ప్రారంభం అవ్వగా.... కొని నిమిషాల్లోనే టికెట్స్ అని హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఫస్ట్ వీకెండ్‌కు సంబంధించిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

అంతా పాజిటివ్ బజ్
సాధారణంగానే మహేష్ బాబు మూవీ అంటేనే గత చిత్రాలతో సంబంధం లేకుండా పాజిటివ్ బజ్ ఉంటుంది. ‘భరత్ అనే నేను' చిత్రంపై ఇది మరింత ఎక్కువగా ఉంది. ప్రీమియర్ షో టాక్, ట్రయల్ షో టాక్ కూడా సూపర్ గా ఉండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications











