For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్యాన్ చేయమని మహిళా సంఘాలు...జీవితా రాజశేఖర్ స్పందన

  By Srikanya
  |

  హైదరాబాద్ : యామినీ భాస్కర్‌, జ్వాలాకోటీ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కీచక'. యన్‌.వి.బి.చౌదరి దర్శకుడు. ఈ చిత్రం విడుదల ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రం లో గ్రాఫిక్స్ వయిలెన్స్ ఎక్కువైందని, సెక్సువల్ అబ్యూజ్ ఉందని కొన్ని మహిళా సంఘాలు వారు ఉద్యమిస్తున్నారు. సినిమాలో నుంచి వాటిని తొలిగించి విడుదల చేయకపోతే తమ ఆగ్రహాన్ని చూడవలసివస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే సినిమా ప్రదర్శనను సైతం ఆపుచేస్తామని అంటున్నారు.

  ఈ మేరకు షి హెల్ప్ ఫౌండేషన్ అధ్యక్ష్యడు విజయ్ రెడ్డి మాట్లాడుతూ... "మేము దర్శకుడుకు గానీ, సినిమా గానీ అభ్యంతరం చెప్పటం లేదు. మా సమస్య అంతా... విడుదలైన 126 సెకండ్ల ట్రైలర్ తోనే, రీసెంట్ గా యూ ట్యూబ్ లో విడుదలైన ఈ ట్రైలర్ ని వెంటనే తొలిగించాలని కోరుకుంటున్నాం. ఇందులో స్త్రీలను దారుణంగా కొట్టడం, సిగెరెట్ తో కాల్చటం, సెక్యువల్ గా అబ్యూజ్ చేయటం వంటివి ఉన్నాయి. ," అన్నారు. ఈ మేరకు వారు ఓ మీడియా సమావేశం నిర్వహించారు.

  అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ అశోశియేషన్ ప్రెసెడింట్ ఎ రమ్య కుమారి మాట్లాడుతూ..." వారు మైనర్లు ని కూడా సెక్సువల్ గా అబ్యూజ్ చేస్తూ చూపించారు ట్రైలర్ లో , చాలా డిస్ట్రబింగ్ గా ఉంది, ఆడవాళ్లను వల్గర్ గా చూపించి దర్శకుడు డబ్బు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇటువంటి ప్రయత్నాలను ఖండిస్తున్నం ," అన్నారామె.

  Ban Keechaka for Graphic Violence: Activists

  అలాగే కుమారి కంటిన్యూ చేస్తూ...."సెన్సార్ ఇలాంటి సన్నివేశాలకు పర్మిషన్ ఎలా ఇచ్చిందో అర్దం కావటం లేదు..చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వల్గర్ గా స్క్రీలను చూపిస్తూ..ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. సెన్సార్ గైడ్ లైన్స్ ప్రకారం అలాంటి సన్నివేశాలను పూర్తిగా తొలిగించాలి ," అన్నారు.

  ఈ విషయమై సెన్సార్ బోర్డ్ మెంబర్ జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ...., "మేము అలాంటి ట్రైలర్ ఏది సెన్సార్ చేయలేదు. దురదృష్టవశాత్తు చాలా మంది నిర్మాతలు సెన్సార్ కానీ ట్రైలర్స్ చాలా వరకూ యు ట్యూబ్ లో, టీవిల్లో ప్రదర్శిస్తూ మమ్మల్ని ఇబ్బందికు గురి చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ వాటిని మేం కంట్రోలు చేయలేం. అందుకు సంభందించిన వారే భాధ్యాతాయుతంగా వ్యవహరించి ఇలాంటి వాటిని ఆపుచేయాలి ." అన్నారు.

  పర్వతరెడ్డి కిషోర్‌ కుమార్‌ నిర్మాత. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని లీకెడ్ వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. సినిమాలో ని కొన్ని సీన్స్ ఇలా వీడియోగా ఎడిటింగ్ టేబుల్ మీద నుంచి బయిటకు వచ్చాయని చెప్తున్నారు. ఆ వీడియో చాలా దారుణంగా ఉంది. వీడియోని అప్ లోడ్ చేయటానికి కూడా ఇబ్బందిగా అనిపించి మా పాఠకులకు అందించటం లేదు. ఆ వీడియో స్క్రీన్ షాట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక ఇలాంటి వీడియో కలిగిన సినిమాను ఎలా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారన్నది అసలు సమస్య.

  Ban Keechaka for Graphic Violence: Activists

  ఈ రాక్షసత్వం ఏంటి? మైనర్ బాలికపై అత్యాచారం, మహిళను విపరీతం గా హింసించడం, సిగరెట్ తో కాల్చడం.... ఇది సినిమానా శాడిజానికి పరాకాష్టా? సెన్సార్ నిద్రపోయిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కొన్ని మహిళా సంఘాలు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాయి.

  దర్శకుడు మాట్లాడుతూ ''నాగ్‌పుర్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నిర్భయలాంటి చట్టాలున్నా మహిళలపై అన్యాయాలు, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిపై ఓ మహిళ చేసిన తిరుగుబాటు ఈ చిత్రం. ఆడదంటే అబల కాదు ఆదిపరాశక్తి అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నామ''న్నారు. జీవితాంతం రేప్ లు చేస్తూ చివరకు అత్యంత దుర్మరణం పొందిన రేపిస్టు అక్కు యాదవ్ లైఫ్ ని ఆధారం చేసుకుని నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.

  ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గులైన సైకో లలో ఒకడైన అక్కు యాదవ్ జీవిత గాధ ఆధారం గా నిర్మించ బడిన చిత్రం కీచక. అతని జీవితం అతనిలాంటి వాళ్లందరికీ ఒక గుణపాఠం గా మిగలాలి అన్న ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని నిర్మించామని ఫిల్మ్ మేకర్స్ తెలియజేశారు. అయితే అంతటి దుర్మార్గుడి కథ ను తెరకు ఎక్కిస్తున్న సందర్భం లో కొన్ని చోట్ల హార్ష్ గా, మరికొన్ని చోట్ల వయోలెంట్ గా ఉండక తప్పలేదని వారు అన్నారు.

  Ban Keechaka for Graphic Violence: Activists

  సెన్సార్ నుండి ఎడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం నిజానికి Grown Ups Only అని అభివర్ణించారు. ఈ చిత్రం కొంతమందిని అప్సెట్ చేస్తుంది. ఇంకొంత మందిని ఆలోచింపజేస్తుంది. మహిళలను వేధించే వారికి ఇదొక హెచ్చరిక లా తోస్తుంది.బాధితులకు ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అని మేకర్స్ చెప్పారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  దాదాపు సినిమాలో 15 రేప్ సీన్స్ , అదీ బాగా వయిలెంట్ గా ఉన్న చిత్రం ఒకటి రీసెంట్ గా సెన్సార్ అయ్యిందని సమాచారం. ఈ చిత్రం పేరు కీచక. నాగపూర్ లో మూడు వందల మందిని రేప్ చేసిన ఓ రాక్షసుడి యదార్ద గాధ ఆధారంగా ఈ చిత్రం నిర్మించారని టాక్. దాంతో సినిమాలో అవకాసమున్న చోటల్లా రేప్ లు మెయిన్ క్యారెక్టర్ చేత చేయించేసారని తెలుస్తోంది. అదీ ఏ సింబాలిక్ గానో కాకుండా స్టెయిట్ గానే ఉన్నాయని చెప్తున్నారు.

  అయితే అన్ని రేప్ లు ఉన్న సినిమాకి సెన్సార్ రావటానికి కారణం సినిమా చివర్లో ఏదో మెసేజ్ లాంటిది ఉందని అందుకే ఆపలేదని అంటున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక ఈ రేప్ సీన్స్ కు మహిళా సంఘాల నుంచి వివాదం ఎదురవుతుందేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  Ban Keechaka for Graphic Violence: Activists

  యామిని భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కీచక. కిశోర్ పర్వతరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌వీబీ చౌదరి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్ని అరికట్టే క్రమంలో ఓ యువతికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. మహిళల్లో చైతన్యాన్ని కలిగించే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఆస్కార్ నామినేటెడ్ మిణుగురులు కథారచయిత ఎస్‌వీబీ చౌదరి దర్శకత్వ ప్రతిభ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే... సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో... ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  నిర్మాత మాట్లాడుతూ ...‘‘సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ స్ర్తీ చేసిన పోరాటమే ఈ సినిమా. వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టేలా దర్శకుడు తీర్చిదిద్దనున్నారు. '' అని తెలిపారు.

  దర్శకుడు మాట్లాడుతూ... ''సమాజంలో స్త్రీలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిపై ఓ అమ్మాయి ఎలా స్పందించింది? ఎలాంటి పోరాటం చేసింది? అనే విషయాల్ని తెరపై చూపిస్తున్నాము ''అన్నారు.

  జ్వాలా కోటి, యామినీ భాస్కర్‌, రఘబాబు, గిరిబాబు, వినోద్, నాయుడు, రోజా భారతి, బోసుబాబు, శ్రీహర్ష, ఝాన్సీ, మమత, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రజిత తదితరులు . ఈ చిత్రానికి మాటలు: రాంప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కమలాకర్‌, సంగీతం: జోస్యభట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి.

  English summary
  Jeevitha Rajasekhar, member of the censor board, clarified, “We have not cleared any trailer from Keechaka movie. Unfortunately a lot of producers are releasing trailers on YouTube and on TV channels without the consent of the Censor Board and this is causing us great embarrassment. We cannot control what people share on social media and it is the people who have to take up the responsibility and put a stop to this.” Filmmaker NVB Chowdary’s dark crime thriller Keechaka has run into trouble with women’s rights organisations for showcasing scenes of graphic violence and sexual abuse in the film. Furious activists vented their ire on the shocking depiction of women in the film and threatened to stall its screening, if the scenes of abuse aren’t removed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X