మహేష్ బాబు ఫిట్‌నెస్ ట్రైనర్‌పై నిషేదం!
హైదరాబాద్ : సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1' సినిమా కోసం మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఆధ్వర్యంలో తన బాడీ రూపులు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైనింగ్ తర్వాత 37 సంవత్సరాల వయసుగల మహేష్ బాబు పాతికేళ్ల కుర్రాడిలా మారిపోయాడు.

తాజాగా క్రిస్ గెతిన్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. దేశంలోనే బాగా పాపులర్ అయిన ముంబైలోని 'గోల్డ్ జిమ్'లో ఆయన ప్రవేశాన్ని నిషేదించారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్రిస్ గెతిన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫిట్‌నెస్ ట్రైనర్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా సినిమా '1' కోసం, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 'క్రిష్-3' సినిమా కోసం, ఇంకా జాన్ అబ్రహం లాంటి స్టార్లు తమ బాడీ షేపులు మార్చుకోవడం కోసం ఆయన వద్ద ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు.
క్రిస్ గెతిన్ 'గోల్డ్ జిమ్'లోకి ఎంటరైతే ఆ జిమ్‌కు వచ్చే రెగ్యులర్ క్లైంట్స్ తమ జిమ్ వదిలి ఆయన వద్ద ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్లే ప్రమాదం ఉందనే భయంతో గోల్డ్ జిమ్ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుందట. దీనిపై క్రిస్ గెతిన్ స్పందిస్తూ నాకు అలాంటి అవసరం లేదు, నేను ఎవరి క్లైంట్లను దొంగిలించడం లేదు అని స్పష్టం చేసారు.
క్రిస్ నిషేదం సంగతి పక్కన పెడితే.... క్రిస్ ట్రైనింగ్ సయమంలో మహేష్ బాబు ఏం తినేవాడో తెలుసా?...క్రిస్ గెతిన్ చెప్పిన వివరాల ప్రకారం రోజుకు 7 సార్లు పౌష్టికారం తీసుకునే వాడట మహేష్ బాబు. అందులో చికెన్, ఫిష్, బచ్చలి కూర, ఓట్స్, పాస్తా, బ్రాకోలి లాంటి అధిక పోషక విలువలున్న పదార్థాలు ఉండేవట.


Click it and Unblock the Notifications











