ప్రకాష్రాజ్కు పచ్చ జెండా?

మరోవైపు వెంకటేష్‌తో "చింతకాయల రవి"లోనూ ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఆ సినిమాకు నల్లమలుపు బుజ్జి నిర్మాత బాధ్యత వహిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ఇటీవలే ప్రకాష్ రాజ్‌కు నిర్మాతల మండలి వివరణ కోరుతూ నోటీసు పంపింది. దానికి ఆయన తగిన రీతిలో సమాధానమిచ్చారని నిర్మాతల మండలి సభ్యుడొకరు తెలిపారు. అయితే సోమవారం రాత్రి ప్రకాష్‌రాజ్‌ను తీసుకుని నిర్మాత నల్లమలుపు బుజ్జి ఫిలింఛాంబర్ కార్యాలయానికి వచ్చారుట. అక్కడ కమిటీకి ఆయన తన వివరణ ఇచ్చారు. ఆ వివరాలు ఎలా ఉన్నా... ప్రస్తుతం "చింతకాయల రవి" చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంఘటనతో పరిశ్రమలో చిన్న నిర్మాతలుకు ఒక రకంగా పెద్ద వారికి మరో విధంగానూ పక్షపాత ధోరణి పూర్తి స్ధాయిలో బయిట పడిందని కొందరు బహిరంగంగానే విమర్శస్తున్నారు.


Click it and Unblock the Notifications











