మరో హీరోయిన్ పై బ్యాన్
ఈ మధ్యన వరసగా హీరోయిన్స్ పై బ్యాన్ పెట్టాలనే నిర్ణయాలు వినిపిస్తున్నాయి. నిర్మాతలతో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిం చడమే గాక అవమానపరి చిందనే కారణంతో..అలా మొదలైంది నిత్యామీనన్‌ను పై బ్యాన్ పెట్టాలని ఆలోచించిన మలయాళ చిత్రసీమ.. తాజా గా మరో హీరోయిన్ పై పంజా విసరడానికి సన్నద్దమవు తోంది.ఆమె పేరు రీమా కలింగల్.'ఉన్నన్"చిత్రీకర ణలో సరైన సమయానికి షూటింగ్ స్పాట్‌కి రానందున నిర్మాత ఆర్థికంగా నష్టం చవిచూడా ల్సొస్తోందం టూ...ఆ చిత్ర దర్శకుడు శిభి మలైల్ రీమాపై ఛాంబర్ (ఎఫ్‌ఇఎఫ్‌కెఎకి)కి ఫిర్యాదు చేశారు. దీంతో మండలి సమావేశమై రీమా ను నిషేధించాలని యోచిస్తునట్లు తెలుస్తోంది. ఇదే విష యమై మీడియా ..రీమాని ప్రశ్నిస్తే.. ''మాదంతా ఒకే కుటుంబం. ఫ్యామిలీ అన్నాక చిరుబు ర్రులు, కోపతాపాలు కల గడం చాలా సహజం. ప్రస్తు తం నేను షూటిం గులోనే ఉన్నా. అలాంటి సమస్యేం లేదు"" అంది ఏమంటే మళ్లీ ఏ తలనొప్పి వస్తుందనే బెంగతో. ఇక నిత్యామీనన్ తన బ్యాన్ గురించి మాట్లాడుతూ...అదొక దురదృష్ట ఘటన అనీ, కొన్ని అపార్థాల వల్ల భేదాలు వచ్చాయంది.
ఐతే తన చొరవతో అవన్నీ ఇప్పుడు తీరిపోయాయిని చెప్పుకొచ్చింది. ఆమెపై బ్యాన్ పెట్టిన కారణాల్లోకి వెళితే...షూటింగ్‌లో ఉన్న తనను కలవడానికి వచ్చిన కొంతమంది నిర్మాతలను పట్టించుకోలేదు. అంతేగాక వాళ్ళతో మళ్ళీ కలుస్తానని చెప్పి కలవలేదు. దాంతో వాళ్లకు కోపం వచ్చి మలయాళ నిర్మాతల మండలికి నిత్యాపై ఫిర్యాదు చేశారు. ఆమెను మలయాళచిత్రాల్లో అవకాశాలు ఇవ్వకుండా చూడాలని కోరారని తెలుస్తోంది. నిర్మాతలమనే మినిమం గౌరవం లేకుండా బిహేవ్ చేస్తోందని,చాలా అగౌవర పరిచిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆమెను బ్యాన్ చేయాలని వారు పట్టుపడుతున్నారు. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. తన కుమార్తెపై నిర్మాతలు చేసిన ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందనీ, నిత్యామీనన్ మలయాళ నిర్మాతల మండలితో చర్చిస్తోందని నిత్యామీనన్ తల్లి మీడియాకు తెలిపింది.


Click it and Unblock the Notifications











