స్నేహ ఉల్లాల్ పై నిషేధం?
నాగార్జున మేనల్లుడు సుశాంత్ సరసన 'కరెంట్' లో సోలో హీరోయిన్ గా చేసిన స్నేహ ఉల్లాల్ పై బ్యాన్ విదిచనట్లు సమాచారం.'కరెంట్' చిత్రానికి ముందే ఓ నిర్మాత చిత్రానికి కమిట్ అయిన స్నేహ 16 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది. అయితే ఆ తర్వాత ఆ చిత్రంలో నటించకపోవడమే కాకుండా అడ్వాన్ కూడా తిరిగి ఇవ్వలేదట. దీంతో సదరు నిర్మాత తన అడ్వాన్స్ డబ్బులు తిరిగిమ్మని స్నేహ కు చెప్పినా ఫలితం కనబడ లేదట. దాంతో ఆయన స్నేహ ఉల్లాల్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. దీనిపై స్నేహ సత్వరం స్పందించి సెటిల్ మెంట్ కు రాకుంటే ఆమెపై నిషేధం అనివార్యం కావచ్చని అంటున్నారు.
సల్మాన్ ఖాన్ 'లక్కీ' చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన స్నేహ ఉల్లాల్ ఆమధ్యన దర్శకుడు కరుణాకరన్ దృష్టిలో పడి 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ చిత్రం సక్సెస్ కావడం, స్నేహలో ఐశ్వర్యారాయ్ పోలికలు ఉండటంతో ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. మంచు మనోజ్ 'నేను మీకు తెలుసా'లో మధ్య తడిసిన అందాలతో కనిపించిన స్నేహ మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. ఈమధ్యనే నాగార్జున 'కింగ్'లోని ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించి సుశాంత్ సరసన 'కరెంట్' లో ఆఫర్ సంపాదించింది. ఇలా కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో బ్యాన్ పడితే కెరీర్ కు గండిపడినట్టే అంటున్నారు సీనియర్స్.


Click it and Unblock the Notifications











