twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైవిధ్యంగా బాణం ఆడియో

    By Staff
    |

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తేదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ కథానాయకుడిగా పరిచయమౌతున్న చిత్రం 'బాణం'. వేదిక కథానాయిక. ప్రఖ్యాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ కుమార్తెలు 3 ఏంజెల్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వినాయక చవితి రోజున (ఆగస్ట్ 23న) విడుదల చెయ్యబోతున్నారు.

    ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైవిధ్యంగా నిర్వహించబోతున్నట్టు తెలిసింది. ఒక్కో పాటని ఒక్కో ఛానల్ చొప్పున మొత్తం నాలుగు న్యూస్ ఛానల్స్ లో విడుదల చెయ్యబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఎన్టీఆర్ లు ఈ ఆడియోను ఆవిష్కరించబోతున్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు కూడా పాల్గొనబోతున్నారు.

    3 ఏంజెల్స్ పతాకం పై రూపొందిన తొలి చిత్రంగా మన ముందుకు వస్తున్న ఈ చిత్రం ద్వారా చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమౌతున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X