‘బాణం' దర్శకుడి నెక్ట్స్ చిత్రం ఫస్ట్ లుక్ ఇదే

ఇక ఈ చిత్రానికి 'బసంతి' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదో యాక్షన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. దర్శకుడు గత చిత్రం బాణం కి మంచి టాకే వచ్చినా...బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్లు కురిపించలేక పోయింది. అయితే చైతన్యకు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందాయి. గౌతమ్ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. ఆయన 'పల్లకిలో పెళ్లి కూతురు', 'వారెవా' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయితే'బసంతి' చిత్రం వీరిద్దరి కెరీన్ ని మలుపు తిప్పుతుందని.. గౌతమ్ కి వివాహంతో కలిసి వస్తుందని అంటున్నారు.
గౌతమ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సినిమాటోగ్రాఫర్ మరియు నిర్మాత శ్రీనివాస రెడ్డి కుమార్తెని వివాహం చేసుకోబోతున్నాడు. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. హైదరాబాద్ లోని HICC(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) లో ఈ నెల 24న ఘనంగా ఈ వివాహం జరగనుంది. ఇరు వైపులకు చెందిన వారు సినిమా వారే కావటంతో ఈ వివాహానికి సినిమావారు చాలా మంది హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఆహ్వానాలు అందరికీ స్వయంగా కలిసి మరీ ఇచ్చారని సమాచారం.


Click it and Unblock the Notifications











