For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ హిట్ హిందీ రీమేక్ లో నాని ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : వరసగా పిల్ల జమీందార్,ఈగ చిత్రాల విజయంతో మంచి ఊపు మీద ఉన్న నాని కి మరో మంచి ఆఫర్ వచ్చిందని వినికిడి. హిందీలో సూపర్ హిట్టైన 'బ్యాండ్ బజా బరాత్'రీమేక్ లో నానికి అవకాసం వచ్చినట్లు కోలీవుడ్ సమాచారం. అనూష్క శర్మ హీరోయిన్ గా చేసిన ఆ చిత్రం రెండు సంవత్సరాల క్రితం మంచి విజయం సాధించింది. పంజా దర్శకుడు విష్ణు వర్దన్ అశోశియేట్ గోకుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తారు. ఓ ప్రముఖ తమిళ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరోయిన్ గా ఇష్క్ జాదే ఫేమ్ పరిణీతి చోప్రాను ఎంపిక చేయనున్నారు.

  ప్రస్తుతం నాని హీరోగా తమిళ తెలుగు భాషల్లో ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రం రూపొందుతోంది. నాని, సమంత జంటగా గౌతమ్‌ వాసుదేవమీనన్ దర్శకత్వంలో తేజ సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సినిమాలో సమంత, నాని ఆరేళ్ల వయసులో కలుస్తారు. తర్వాత పదిహేనేళ్ల వయసులో కలుస్తారు. 20, 25ఏళ్ల వయసులోనూ కలుస్తారు. ఇలా ప్రతి ఏజ్‌లోనూ వాళ్ళలో వచ్చిన మార్పులు, భావోద్వేగాలు, అనుభూతులే ఈ సినిమా. నాని,సమంతలు సైతం ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. సమంత ఈ చిత్రంలో తనకు డిఫెరెంట్ పాత్ర అని...టీనేజ్ అమ్మాయిగా,పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో కనిపిస్తున్నాని చెప్తోంది.

  నాని మాట్లాడుతూ ''చిన్నప్పటి నుంచీ ఇళయరాజా సంగీతం అంటే పిచ్చి. నా ఫోన్‌లో కూడా ఆయన పాటలే ఉంటాయి. నేను సహాయ దర్శకుణ్ని కావడానికి స్ఫూర్తినిచ్చిన దర్శకుల్లో గౌతమ్‌మీనన్‌ ఒకరు. వీరిద్దరితో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ కథ విన్నప్పుడు నా ప్రేమ కథే అనిపించింది. మనసు ఎటో వెళ్లిపోయింది. ప్రేక్షకులకీ అలాంటి భావనే కలుగుతుంది''అన్నారు. గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ -''తెలుగులో నాకు మూడవ స్ట్రయిట్ ఫిలిం ఇది. 'ఏ మాయ చేశావె'తో పోలిస్తే సమంతలో చాలా వైవిధ్యం కనిపించింది. అద్భుతమైన నటి ఆమెలో ఆవిష్కృతం అయ్యింది. నాని చాలా బాగా చేశాడు. కెమెరా ముందుకొస్తే ఎంతో లవ్లీగా కనిపించాడు తను. వరుసగా నానీతో సినిమాలు చేయాలనిపించింది. తొలుత ఈ సినిమాకి రహమాన్‌నే మ్యూజిక్ డెరైక్టర్‌గా అనుకున్నాం. తనకు ఖాళీ లేకపోవడంతో ఇళయరాజాని పెట్టాం. అద్భుతమైన సంగీతాన్నందించారాయన. నేను చేసిన సినిమాల్లో నా ఫేవరెట్ మూవీ ఇది'' అన్నారు.

  ఈ సమావేశంలో సి.కళ్యాణ్‌మాట్లాడుతూ -''ఈ సినిమా తీయడం గర్వంగా, ఆనందంగా ఉంది. 12 ఏళ్ల క్రితం గౌతమ్‌వాసుదేవమీనన్ తొలి చిత్రం 'చెలి'ని నేనే విడుదల చేశాను. మళ్లీ గౌతమ్ సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుందో స్టిల్స్, టీజర్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తొమ్మిది లక్షలమంది ఈ టీజర్స్‌ని వీక్షించారు. దీన్నిబట్టి ఈ సినిమా క్రేజ్‌ని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ గౌతమ్ 'పిల్లలు ఎగామ్స్ బాగా రాయాలి. కాలేజీలు తెరవాలి. ఆ ఉత్సాహంలో ఈ సినిమా చూడాలి' అన్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్‌ని స్లోగా చేయడం జరిగింది. పాటలన్నీ లండన్‌లో రికార్డ్ చేశాం. 'చందమామ' తర్వాత నిర్మాతగా నాకు అంతకు మించి పేరు తెచ్చిపెట్టే చిత్రం ఇది'' అని చెప్పారు.

  English summary
  Nani agreed to do the remake of Bollywood super hit Band Baaja Baarat. Gokul, an associate of director Vishnuvardhan (of Panjaa fame), is now planning to remake Band Baaja Baaraat in Tamil and Telugu, for a Tamil producer. He is also planning to rope in ' Ishaqzzade' fame Parineeti Chopra to play the female lead opposite Nani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X