ఎన్టీఆర్ 'బాద్‌షా'గురించి నిర్మాత
హైదరాబాద్ : ''వినోదాత్మకమైన కథ ఇది. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ త్వరలో మొదలుపెడతాం. సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమన్ బాణీలు హుషారుగా సాగిపోతాయి''అని నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. వినోదాన్ని యాక్షన్ కథల్లో మేళవించే దర్శకుడు శ్రీను వైట్ల. కథానాయకుడి చేత పోరాటాలతో హంగామా చేయిస్తారు... వినోదమూ పండిస్తారు. ఈ తరహా పాత్రల్లో ఒదిగిపోయే హీరో ఎన్టీఆర్. వీరిద్దరి కలయికలో 'బాద్‌షా' తెరకెక్కుతోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవలే ఇటలీ, స్విట్జర్లాండ్‌లలో చిత్రీకరణ జరిగింది. అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ గీతాన్ని తెరకెక్కించారు. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడే రెండు పాటలు కాజల్,ఎన్టీఆర్ మధ్యన తీయనున్నారు. అలాగే ఎమ్.ఎస్ నారాయణ,కాజల్,వెన్నెల కిషోర్,ఎన్టీఆర్ మధ్యన కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని తీస్తున్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు.
ఈ చిత్రం బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. నెల్లూర్ రైట్స్ ని శ్రీ నికేతన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నామని కన్ఫర్మ్ చేసారు. గబ్బర్ సింగ్ కు కూడా మొదట వారే డిస్ట్రిబ్యూటర్ గా కన్ఫర్మ్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో గణేష్ తను నిర్మిస్తున్న బాద్షా కి కూడా అదే డిస్ట్రిబ్యూటర్స్ చేత బిజినెస్ ప్రారంభించాడు. సెంటిమెంట్ గా ప్రారంబించిన దీనికి నామినల్ అడ్వాన్స్ ఆ ఏరియా నుంచి వచ్చింది. నెగేషియేషన్స్ తర్వాత జరగుతాయి. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.
ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











