ఎన్టీఆర్ ‘బాద్‌షా’ ఓ ‘స్పెషల్ పీస్’
హైదరాబాద్ : ఎన్టీఆర్ హెయిర్‌స్టయిల్ నుంచి పెట్టుకున్న వాచ్, మాట్లాడే ప్రతి మాటా.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. బ్రాండెడ్ వేర్‌లో 'లిమిటెడ్ ఎడిషన్' అంటారే... అలా ఈ 'బాద్‌షా' ఓ 'స్పెషల్ పీస్'లాంటిది. ఆరంభం నుంచి శుభం వరకు శ్రీను వైట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చేశారు. మేమందరం గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుంది అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఆయన మరో ప్రక్క అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో చిత్రం చేస్తున్నారు.
ఒకేసారి రెండు సినిమాల నిర్మాణం... రెండు పడవల మీద ప్రయాణంలా అనిపిస్తున్నాయని చెప్తూ... 'బాద్‌షా' కొంచెం ఆలస్యం అయ్యింది. ఈలోపు 'ఇద్దరమ్మాయిలతో' ఆరంభించడంతో రెండు సినిమాలూ సెట్స్ మీద ఉన్నాయి. ఇలా ఒకేసారి రెండు సినిమాలు నిర్మించడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే అందరికన్నా లొకేషన్లో ముందుండి, చివరగా వెళ్లేది నేనే అవ్వాలనుకుంటాను. రెండు సినిమాలు చేసినప్పుడు అది కష్టమవుతుంది. రెంటికీ న్యాయం చేయాలనే తపనతో ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. అందుకే ఇకనుంచి ఒకేసారి ఒక సినిమా మాత్రమే చేయాలనుకుంటున్నాను అన్నారు.
గణేష్‌కి ఇంత డబ్బెలా వచ్చిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. దానికి సమాధానం చెప్తూ... నా సమాధానం చాలా సింపుల్. అలా సందేహపడేవాళ్లు ఒక్క స్టార్ హీరో డేట్స్ సంపాదించి చూడమనండి. జేబులో వంద రూపాయలు లేకుండా కూడా సినిమా చేసేయొచ్చు. ఆ స్టార్ పేరే సినిమాకి పెట్టుబడి. అందుకే అంటున్నాను... ఒక స్టార్ హీరో మనసు గెల్చుకుంటే లైఫ్ సెటిలైపోయినట్లే అని. సినిమా పరిశ్రమలో డబ్బులున్నవాళ్లు చాలామంది ఉంటారు. కానీ 'గుడ్‌విల్' సంపాదించుకున్నవాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. గణేష్‌కి డేట్స్ ఇస్తే.. సినిమాకి న్యాయం చేస్తాడనే నమ్మకంతోనే నాకు ఇస్తున్నారు. నా మంచితనమే నన్ను కాపాడుతోంది అన్నారు.


Click it and Unblock the Notifications











