ఇండస్ట్రీ చూసి నేర్చుకుంటే బాగుంటుంది..చిరంజీవిపై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్
బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి ఎంతటి విధేయుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి దగ్గరిగానే ఉంటూ వచ్చాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించేవారిలో బండ్ల గణేష్ ముందుంటాడు. బండ్ల గణేష్ ఇంట్లో జరిగే శుభకార్యాలకు చిరంజీవి కూడా హాజరువుతుంటాడు. ఎన్నో యేళ్ల నుంచి మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా భావిస్తాడన్న సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీతో సినిమాలు..
తీన్‌మార్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ ఆపై గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే వంటి చిత్రాలను నిర్మించాడు. నిర్మాతగా మెగా హీరోలతోనే ఎక్కువగా కలిసి పని చేశాడు. తాజాగా బండ్లన్న కరోనాతో పోరాడి విజయం సాధించాడు.

చిరు పరామర్శ..
తనకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు చిరంజీవి ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడాడని, ఆయన మాట్లాడాక కొండంత ధైర్యం వచ్చిందని తెలిపాడు. తాజాగా చిరంజీవిపై బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

కొండంత బలం..
కరోనా సమయంలో తనను పరామర్శించడంపై బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ ఓ ట్వీట్ వేశాడు. ‘ఎలా ఉన్నావు అన్న మీ పరామర్శ మాకు కొండంత బలం తెలియని ఆనందం ఎంతో సంతోషం ధన్యవాదాలు అన్నగారు' అంటూ పేర్కొన్నాడు.
Recommended Video

ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి..
మరో ట్వీట్ చేస్తూ.. ‘కష్టంతో పైకి వచ్చిన వాళ్ళకి కష్టం తెలిసిన వాళ్లకి ఏ అండ లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మనసు ప్రేమ అ అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్న అందుకు మీరే ఉదాహరణ యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆశ వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాన'ని బండ్ల గణేష్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











