twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను జోకర్‌ను కాదు ఫైటర్‌ని.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్.. అది వార్నింగా? రిక్వెస్టా?

    |

    ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణలో ఎంతటి హాట్ టాపిక్‌గా మారాయో అందరికీ తెలిసిందే. కేంద్ర మంత్రులు రాక, ఇక్కడి నాయకుల ప్రసంగాలు, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇవన్నీ ఒక వైపు జరుగుతూ ఉంటే.. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ మరో లెవెల్‌లో ఉంటున్నాయి. మొత్తానికి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం కీలకంగా కానున్నాయని అందరూ అంటున్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా బండ్ల గణేష్ పేరు మాత్రం పదే పదే వార్తల్లో నిలుస్తూనే ఉంది.

    అప్పుడు అలా..

    అప్పుడు అలా..

    2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. ప్రాసలతో ప్రసంగాలు, లైవ్‌లో డిబేట్లు చేసిన కేసీఆర్, కేటీఆర్, కవితల మీద బాగానే సెటైర్లు వేశాడు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అతి నమ్మకంతో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేశాడు. మాటలు జారి చివరకు బ్లేడ్ గణేష్ అనే ముద్ర వేయించుకున్నాడు.

    రాజకీయాల్లోంచి తప్పుకుని..

    రాజకీయాల్లోంచి తప్పుకుని..

    ఇక ఆ ఎన్నికల ఫలితాన్ని చూసుకున్న బండ్ల గణేష్ స్వచ్చందంగా రాజకీయాలకు స్వస్తి పలికాడు. ఇకపై రాజకీయాల్లో కొనసాగనని, తన జీవితం సినిమాకే అంకితమని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి సినిమాల గురించే ఆలోచించడం ప్రారంభించాడు. ఓ సినిమాలో నటించాడు. మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

    మళ్లీ ఎంట్రీ అంటూ..

    మళ్లీ ఎంట్రీ అంటూ..

    అయితే ఈ మధ్య బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీపై రూమర్లు వచ్చాయి. బీజేపీలో చేరనున్నాడని వచ్చిన పుకార్లపై బండ్ల గణేష్ స్పందించాడు. నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన అంటూ క్లారిటీ ఇచ్చాడు. మళ్లీ అలాంటి రూమర్లే వస్తే మళ్లీ ఖండించాడు.

    Recommended Video

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ బండ్ల గణేష్ గురించి కామెంట్ చేసింది. గత ఎన్నికల్లో బండ్ల గణేష్.. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ కామెడీలు చేస్తున్నారని తన ప్రసంగంలో మాట్లాడింది. ఆ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. కవిత గారు.. నేను జోకర్‌ను కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం నేను రాజకీయాల్లోకి ఉండాలని అనుకోవడం లేదు. ఆల్ ది బెస్ట్ అంటూ దండం పెట్టేశాడు. అయితే ఇది వార్నింగా? అభ్యర్థనా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Bandla Ganesh ABout Kalvakuntla Kavitha Comments, garu I am not a joker , I’m a fighter but I don’t want to be in any politics right now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X