Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సమయంలో ప్రభుదేవాతో ఉంది.. నయనతార గతాన్ని తవ్విన బండ్ల గణేష్
బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. పరమేశ్వర ఆర్ట్స్ స్థాపించిన బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్‌గా దుమ్ములేపాడు. వరుసగా స్టార్ హీరోలతో బడా బడా ప్రాజెక్ట్‌లను సెట్ చేసి హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో గ్యాప్ రావడం, రాజీకయంగా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై దృష్టి తగ్గించాడు. ప్రస్తుతం మాత్రం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే అంటున్నాడు. తాజాగా అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో బండ్ల గణేష్ పాల్గొని అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా నయనతారపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
Recommended Video
అలా నిర్మాతగా..
పవన్ కళ్యాణ్ నన్ను ప్రొడ్యూసర్ చేస్తానని అన్నాడు. ఆపై కథల కోసం అన్వేషించాను. వెంటనే పూరి గారి దగ్గరికి వెళితే.. సరే అని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అంతా సెట్ అయింది. అయితే మధ్యలో ఎన్నికలు వచ్చాయి. దాంతో గ్యాప్ వచ్చింది అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.
అలా ఆంజనేయులు..
గ్యాప్ వస్తుంది.. అంత వరకు రవితేజతో ఓ సినిమా చేసుకుంటాను అని పవన్ కళ్యాణ్‌తో చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నాడు. అలా నిర్మాతగా నా మొదటి చిత్రం ఆంజనేయులు అయింది. ఆ చిత్రం కూడా నాకు లాభాలనే తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్-పూరి కాంబోలో సినిమా చేయలేకపోయాను అని బండ్ల గణేష్ తెలిపాడు.
హీరోయిన్లపై కామెంట్స్..
ఇక అలీ కొందరి హీరోయిన్లను చూపిస్తూ అభిప్రాయాలు చెప్పమని అడిగాడు. అందులో భాగంగా కృతి కర్భందను చూపించాడు. ఆ ఫోటోను చూసిన బండ్ల గణేష్.. ఈ అమ్మాయి పేరు ఏదో ఉందన్నా.. అంటూ కృతి కర్బంధ ఒంగోలు గిత్త హీరోయిన్.. నా తీన్మార్ సినిమాలో ఉంది అని బండ్ల గణేష్ వివరించాడు.
హీరోయిన్లతో ఏం అవరసం..
ఇక త్రిష ఫోటో చూపించడంతో ఎవరీ అమ్మాయి అని అడిగాడు.. మళ్లీ వెంటనే సర్దుకుని త్రిష కదా.. అన్ని బండ్ల గణేష్ అన్నాడు. ఏంటి హీరోయిన్ల కూడా గుర్తుకు లేరా? అని అలీ ప్రశ్నించగా.. మనకు హీరోయిన్లతో పని ఏముంటది.. మనకు హీరోలే కావాలి అంటూ బండ్ల గణేష్ సెటైర్ వేశాడు.
ప్రభుదేవాతో ఉంది..
ఇక అదే క్రమంలో కాజల్ ఫోటోను చూపిస్తే.. నాకు ఇష్టమైన హీరోయిన్.. చాలా మంచి అమ్మాయి.. మూడు సినిమాలు చేశాను అని చెప్పాడు. ఇక నయన తార ఫోటోను చూపిస్తే ఓ రకమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో అలీ సెటైర్ వేశాడు. ఆ టైంలో ఆల్రెడీ ప్రభుదేవా ఉన్నాడు అంటూ బండ్ల గణేష్ మరో కౌంటర్ వేశాడు. ఆమె తన మొదటి సినిమా హీరోయిన్ అంటూ ఆంజనేయులు సినిమాను బండ్ల గణేష్ గుర్తుకు చేసుకున్నాడు. ప్రస్తుతం నయనతార విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. తాజాగా వీరిద్దరు ఓనమ్ పండుగను ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు కూడా.