బండ్లన్నకు భారీ కోరికలున్నాయే.. అదే సంకల్పమట.. పెద్ద స్కెచ్ వేసిన బడా నిర్మాత

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించినా.. స్టార్ హీరోలతో సినిమాలను తీసి బడా ప్రొడ్యూసర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. నటుడిగా ఎన్నో రకాల పాత్రలు చేసినా.. ప్రొడ్యూసర్‌గా తీసిన బ్లాక్ బస్టర్లే గుర్తింపును ఇచ్చాయి. తీన్‌మార్ చిత్రంతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ కాస్త నిరుత్సాహపడ్డాడు. అయితే పవన్ కళ్యాణ్ మరో అవకాశం ఇవ్వడంతో అదిరిపోయే బ్లాక్ బస్టర్‌ను గబ్బర్ సింగ్ రూపంలో పొందాడు.

అలా బండ్ల గణేష్ చేతికి..

అలా బండ్ల గణేష్ చేతికి..

మొదటగా గబ్బర్ సింగ్ సినిమాను తానే నిర్మించాలని పవన్ కళ్యాణ్ భావించారట. కానీ అప్పటికే తీన్‌మార్ నిర్మాతగా బండ్ల గణేష్‌ను నిరాశపరచడంతో పిలిచి మరీ గబ్బర్ సింగ్ చేసుకో అని అన్నాడట. అంతే ఇక ఆ సినిమాతో బండ్ల గణేష్ రేంజే మారింది. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా బండ్లన్న మారిపోయాడు.

బాక్సాఫీస్ రికార్డులు..

బాక్సాఫీస్ రికార్డులు..

దాదాపు పది పన్నెండేళ్లు సరైన హిట్ లేక పవన్ ఫ్యాన్ తీవ్ర నిరాశలో ఉండగా గబ్బర్ సింగ్ లాంటి చిత్రం వచ్చింది. ఇక అభిమానుల దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. గబ్బర్ సింగ్ ఇప్పటికే కాదు ఎప్పటికీ ఓ అపురూపమైన చిత్రమే. పవన్ కళ్యాణ్‌కు, నిర్మాతగా బండ్ల గణేష్‌కు, మెగా ఫ్యాన్స్‌ ఎప్పటికీ ఓ అద్భుతమే.

బుల్లితెరపై సందడి..

బుల్లితెరపై సందడి..

గబ్బర్ సింగ్ చిత్రం వెండితెరపై ఎంత సందడి చేసిందో బుల్లితెరపై అంతకు మించి హల్చల్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టని చిత్రాల జాబితాలో గబ్బర్ సింగ్ కచ్చితంగా ఉంటుంది. నేడు గబ్బర్ సింగ్ ప్రసారం అవుతుండటంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అందులో ఓ అభిమాని పెట్టిన కామెంట్ బండ్లన్నను బాగా ఆకర్షించింది.

నెటిజన్ ట్వీట్..

నెటిజన్ ట్వీట్..

గబ్బర్ సింగ్ చిత్రాన్ని వీక్షిస్తున్న ఓ అభిమాని.. ‘రోజూ 11గంటలకి లేచేవాడిని, ఈరోజు సినిమా అని తెలిసి అలారమ్ పెట్టుకుని మరీ లేచానుఅన్నయ్యలూ (హరీష్ శంకర్, బండ్ల గణేష్) ఇంకో 1000 సంవత్సరాల దాటినా, ఈ సినిమా కి ఉన్న బలుపు ఏమాత్రం తగ్గదు అన్నాFire.మళ్ళీ ఇలాంటి సినిమాని మాకు బహుమతిగా ఇస్తావని ఆసిస్తూ... "ఆయన స్థాయి వేరు,ఆ స్థానం వేరు"' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి బండ్లన్న రిప్లై ఇచ్చాడు.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
అదే సంకల్పం..

అదే సంకల్పం..

సదరు అభిమాని ట్వీట్‌కు బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ.. ‘ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్ తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను.మన పవర్ స్టార్ అభిమానులు ఈ సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా ఇది నా సంకల్పం' అంటూ తనలోని కోరికను బయట పెట్టేశాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లకు కమిట్ అయి ఎటూ తేల్చుకోలేకపోతున్న పవన్.. బండ్లకు అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. మొత్తానికి ఆ దిశగా పెద్ద స్కెచ్చే వేస్తున్నట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X