పవన్ కళ్యాణ్‌కు గాయంపై...నిర్మాత స్పందన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగులో గాయపడ్డాడని, హార్స్ రైడింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా అతని కండరాలకు గాయం అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై పలువురు మీడియా ప్రతినిధులు ఆ చిత్ర నిర్మాత గణేష్‌ను కాంటాక్టు చేయగా....అలాంటిదేమీ లేదని చెప్పినట్లు సమాచారం. పవర్ స్టార్‌కు ఎలాంటి గాయం కాలేదని, ఈ రోజే గుజరాత్ షెడ్యూల్ సక్సెస్‌ఫుల్ గా కంప్లీట్ అయిందని, రేపటికల్లా అంతా హైదరాబాద్ చేరుకుంటామని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాతి షెడ్యూల్ ఏప్రిల్ 5 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
కాగా...చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్‌కు గాయం అయిన విషయం వాస్తవమే తెలుస్తోంది. డాక్టర్ రెండు మూడు రోజుల రెస్టు తీసుకుంటే సరిపోతుందని చెప్పినట్లు సమాచారం. అయితే నిర్మాత ఈ విషయాన్ని కావాలని దాస్తున్నాడని, అది చిన్న గాయం కావడంతో అనవసరంగా దీన్ని ఎక్స్‌ఫోజ్ చేయడం ఇష్టం లేకనే ఆయన అలా చెప్పారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయమై నిజానిజాలు తేలాల్సి ఉంది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిమన్యు సింగ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











