నన్ను నిర్మాత చేసింది నా దేవుడే.. గబ్బర్‌సింగ్ పవన్ కల్యాణ్‌తో కాదు.. వేరే హీరోతో ప్లాన్.. బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు నిర్మాత బండ్ల గణేష్ వీరభక్తుడునే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. వేదిక ఏదైనా పవన్ కల్యాణ్ గురించి కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను చెబుతుంటాడు. గతంలో అలీతో చేసిన ఇంటర్వ్యూలో గబ్బర్ సింగ్ సినిమా వెనుక అసలు కథను చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఏం చెప్పారంటే..

నన్ను నిర్మాతను చేసింది ఆ దేవుడే
కమెడియన్‌గా కొనసాగుతున్న నన్ను నిర్మాతను చేసింది నా దేవుడి లాంటి పవన్ కల్యాణ్. ఆయన ప్రోత్సాహం మేరకే నేను నిర్మాతగా మారాలనుకొన్నాను. ఒకరోజు నన్ను పిలిచి నిన్ను నిర్మాతను చేస్తానని మాటిచ్చాడు. పవన్ ఇచ్చిన మాటతో పూరి జగన్నాథ్ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాను. దాంతో నేను, పూరి వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలిశాం అని బండ్ల గణేష్ తెలిపారు.

ఎలక్షన్స్ రావడంతో ప్రాజెక్టు వాయిదా
పూరి జగన్నాథ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న సమయంలోనే ఎన్నికలు రావడంతో ఆ మూవీ వర్కవుట్ కాలేదు. ఎన్నికలతో పవన్ కల్యాణ్ బిజీగా ఉండటంతో సినిమా చేయడానికి వీలు కాలేదు. దాంతో రవితేజ నాతో సినిమా చేయడానికి రెడీగా ఉండటంతో అంజనేయులు చేశాం. ఆ సినిమా నాకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో హ్యపీగా ఫీలయ్యాను అని బండ్ల గణేష్ వెల్లడించారు.

తీన్మార్ నిరాశ కలిగించింది..
పూరి జగన్నాథ్ సినిమా వర్కవుట్ కాకపోవడంతో పవన్ కల్యాణ్‌తో తీన్మార్ సినిమా చేశాను. ఆ చిత్రం ఆశించినంత ఆడలేదు. దాంతో చాలా నిరాశపడ్డాను. తీన్మార్ మంచి సినిమానే కానీ ఎందుకు ఆడలేదనే బాధ నాకు కలిగింది అని బండ్ల గణేష్ అన్నారు.

దబంగ్ మూవీ హిట్ కావడంతో
అయితే రవితేజతో సినిమా చేస్తున్న సమయంలో సోనుసూద్ మాతో ఉన్నారు. ఆ సమయంలో హిందీలో దబంగ్ సినిమా హిట్ అయిన విషయాన్ని చెప్పారు. దాంతో దబంగ్ సినిమాను తెలుగులో చేయాలని అనుకొన్నాను. రవితేజతోనే ఆ సినిమా చేద్దామని నిర్ణయించుకొన్నాను. ఆ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పవన్ మళ్లీ ఆఫర్ ఇచ్చారు.
Recommended Video

గబ్బర్ సింగ్ అలా తెరపైకి
అప్పటికే పవన్ కల్యాణ్‌తో తీన్మార్ సినిమా తీసి నష్టపోయాను. మళ్లీ సినిమాను అడిగే ధైర్యం చేయలేకపోయాను. దంబంగ్ సినిమాను రవితేజతో చేద్దామని అనుకొంటుండగా పవన్ కల్యాణ్ సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారు. దాంతో గబ్బర్ సింగ్ అలా మొదలైంది అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











