మళ్ళీ బాంబుపేల్చిన బండ్లగణేష్ : 2019 లో వార్ వన్ సైడే, పవన్ నాకు దేవుడు అంటూనే....

బండ్ల గణేష్ ఈ ఇంటర్వ్యూ లో మళ్ళీ కొన్ని కీలకమైన సమాధానాలిచ్చాడు, బొత్సా సత్యనారాయణ తో తన అనుబందం గురించీ, పవన్ మీద తన భక్తి గురించీ ఇలా చెప్పాడు

ఒకప్పుడు బండ్ల గణేష్ అనే పేరు కేవలం టాలీవుడ్ లో ఉండే కమేడియన్ గానే అందరికీ తెలుసు. హీరో పక్కన ఉండే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒకడుగా కనిపించే గణేష్ ఒక్క సారి గా నిర్మాత గనేష్ గా మారిపోవటం ఎవ్వరికీ అంతు పట్టలేదు. కాంగ్రేస్ పార్టీ నాయకుడూ, మాజీ మంత్రీ అయిన బొత్సా సత్యనారయన తో చనువు వల్ల నే గణేష్ అంత ఎదిగాడనీ,

అసలు బొత్సాకి బినామీ "తమ్ముడు గణేష్" అంటూ చెప్పుకున్నారు అయితే ఇందులో నిజం ఎంత ఉందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే వరుసగా తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నా తాను వరుసగా సినిమాలు నిర్మిస్తూనే వెళ్ళాడు తప్ప నా సినిమా ఫ్లాప్ కి ఫలానా వాళ్ళు కారణం అని ఎప్పుడూ నిందించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఏబీఎన్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో మరిన్ని సెగలు రేపేలానే ఉంది

పవన్‌తో దిగిన ఫోటో:

పవన్‌తో దిగిన ఫోటో:

‘టెంపర్‌' సినిమా తర్వాత ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. తాజాగా పవన్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు బండ్ల గణేష్‌. తాజాగా ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంతర్వ్యూలో గణేష్ మాట్లాడే మాటలకి సినీ ఇండస్ట్రీ నే కాదు అన్ని వర్గాలూ ముక్కున వేలేసుకున్నాయి.

టాప్ డైరెక్టర్ :

టాప్ డైరెక్టర్ :

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పబ్లిసిటీ చేసుకునే ఒక దర్శకుడు నా సినిమా తీయడం పట్ల ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా..సినిమాలోని ఒక రెండు షార్ట్స్ తీస్తే టాప్ డైరెక్టర్ అయినట్టేనా? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. దానికే అంతా షాక్ తింటూంటే లేటెస్ట్ గా ఏబీఎన్ చానెల్లో వచ్చే ఒక ప్రోగ్రాం లో పాల్గొన్న గణేష్ మరిన్ని వ్యాఖ్యలు చేసినట్టే కనిపిస్తోంది.

మర్డర్ చేసి వచ్చినా:

మర్డర్ చేసి వచ్చినా:

‘నేను మర్డర్ చేసి వచ్చినా బొత్స సత్యనారాయణ కాపాడతారు' అని ఓ స్టేజీపై అన్న మాటలు కాస్త ఎక్ట్రానే అని తర్వాతఅర్థమయ్యింది, ఆ మాటల వల్ల తనమీద పడ్డ ముద్రని తొలగించుకోవటానికి పదేళ్లు పట్టిందనీ.తానంటే పవన్‌ కల్యాణ్‌కు విపరీతమైన ఇష్టమనీ, ఆయనంటే తనకు దేవుడితో సమానమని చెప్పాడట బండ్ల గణేష్.

 ఎన్టీఆర్‌తో గొడవ:

ఎన్టీఆర్‌తో గొడవ:

పెద్ద హీరోలను ఎలా ప్రసన్నం చేసుకోవాలనేది తనకు మాత్రమే తెలిసిన టెక్నిక్ అయినప్పుడు దాన్ని అందరికీ చెబితే తన పరిస్థితి ఏమిటనీ చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఏ గొడవా లేదని స్పష్టం చేసిన ఈ నిర్మాత. దర్శకుడు కృష్ణవంశీ పై చేసిన వ్యాఖ్యలగురించి మాత్రం సమాధానం చెప్పలేదట.

పవన్ కల్యాణే కారణం:

పవన్ కల్యాణే కారణం:

తాను ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి 200 శాతం పవన్ కల్యాణే కారణమని చెప్తూ చివరలో పేల్చిన బాంబు మాత్రం గట్టిగానే పేలింది.. 2019 ఎన్నికల్లో వార్ వన్‌ సైడ్ అవుతుందనీ, పవన్ తప్పక గెలుస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన బండ్ల గణేష్. ఎంపీ అవ్వాలన్నది తన కోరికనీ,

మొత్తం ఇంటర్వ్యూలో:

మొత్తం ఇంటర్వ్యూలో:

2019 తర్వాత నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం అంటూ ధీమాగా చెప్పాడట. ప్రోమోలోనే ఇంతుంటే అసలు మొత్తం ఇంటర్వ్యూలో ఇంకెన్ని చెప్పిఉంటాడో అనుకుఇంటూ రేపు ప్రసారం కాబోయే ఏపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు అంతా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X