జై పవర్ స్టార్.. వకీల్ సాబ్ సెట్‌లో చివరి రోజు బండ్ల గణేష్.. పిక్స్ వైరల్

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ మేరకు చిత్ర నిర్మాత, యూనిట్ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ చివరి రోజున తదుపరి సినిమా నిర్మాతలు సందడి చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి వకీల్ సాబ్ పూర్తవ్వడంతో మిగతా చిత్రాలకు లైన్ క్లియర్ అయింది. ఇకపై వరుసగా చిత్రాలను పట్టాలెక్కిస్తూ రెడీగా ఉంటాడేమో. అన్నింటి కంటే ముందుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ మొదలుపెట్టేలా కనిపిస్తున్నాడు.

వాయిదాల మీద వాయిదాలు..

వాయిదాల మీద వాయిదాలు..

వకీల్ సాబ్ సినిమా షూటింగ్‌కు ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం, మధ్యలో షూటింగ్‌లకు బ్రేకులు పడ్డాయి. ఆ తరువాత కరోనా, లాక్డౌన్ వల్ల మొత్తానికి వకీల్ సాబ్ వెనక్కిపడిపోయింది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఓ రెండు మూడు నెలలకు వకీల్ సాబ్ షూటింగ్ మొదలైంది.

 ఎట్టకేలకు పూర్తి..

ఎట్టకేలకు పూర్తి..

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు. మామూలుగా అయితే కరోనా లేకపోయి ఉంటే.. ఈ ఏడాది సమ్మర్‌లో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ మీద దాడి చేసేవాడు. కానీ లాక్డౌన్ మూలానా అన్నీ మారిపోయాయి. గత రెండు నెల రోజులుగా షూటింగ్ చేస్తోన్న వకీల్ సాబ్ యూనిట్ నేడు గుమ్మడికాయ కొట్టేసింది.

షూటింగ్ పూర్తి..

షూటింగ్ పూర్తి..

పవన్ కళ్యాణ్‌తో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.. వకీల్ సాబ్ షూటింగ్ నేటితో పూర్తయిందంటూ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు ప్రకటించారు. ఈమేరకు పవన్ కళ్యాణ్ తన చిత్రయూనిట్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. మొత్తానికి ఇలా వకీల్ సాబ్ చివరి రోజున సెట్‌లో బండ్ల గణేష్ సందడి చేశాడు.

నిర్మాతల సందడి...

నిర్మాతల సందడి...

పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్ మరో ఛాన్స్ ఇచ్చినట్టు కూడా తెలిసిందే. ఈక్రమంలో ఇలా వకీల్ సాబ్ షూటింగ్ చివరి రోజున నిర్మాతలిద్దరూ కనిపించారు. బహుషా తమ సినిమా ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడేందుకు వచ్చినట్టు తెలుస్తోంది.

 ఫోటోలు వైరల్..

ఫోటోలు వైరల్..

జై పవర్ స్టార్ అంటూ బండ్ల గణేష్ ఏఎమ్ రత్నం దిగిన ఫోటోలు, పవన్ కళ్యాణ్ తన చిత్రయూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలు, డైరెక్టర్ వేణు శ్రీరామ్‌ను ఆప్యాయంగా హత్తుకోవడం, పోలీస్ ప్రొటెక్షన్ షీల్డ్‌ను చూస్తు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పోజులు తెగ వైరల్అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X