మాస్క్ ధరించి... కోర్టు హాజరైన నిర్మాత బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేష్‌కు సంబంధించిన సినీ నిర్మాణ సంస్థ నుండి టెంపర్ తర్వాత సినిమా రావడం నిలిచిపోయాయి. ఆయన కొన్ని ఆర్థిక వివాదాలు, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గణేష్ మీద దాదాపు 68 చెక్ బౌన్స్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా బండ్ల గణేష్ శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. తన కారును జార్జిక్లబ్‌లో ఉంచి అక్కడి నుంచి కోర్టులోకి వచ్చారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే బండ్ల గణేష్‌ను జడ్జి విచారించారు. తనకు కొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా గణేష్ జడ్జిని కోరినట్లు తెలుస్తోంది.

బండ్ల గణేష్ మీద 68 కేసులు ఉండగా... ప్రొద్దుటూరు కోర్టులో శుక్రవారం 21 కేసులు విచారించినట్లు తెలుస్తోంది. లోక్ అదాలత్‌లో మూడు కేసులు పరిష్కారం అయినట్లు సమాచారం. మిగతా కేసుల తదుపరి విచారణ అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
కోర్టు నుండి బయకు వస్తూ బండ్ల గణేష్ తన ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకున్నారు. మీడియాతో మాట్లాడటానికి కూడా ఆయన నిరాకరించారు. జార్జిక్లబ్‌కు వెళ్లి అక్కడి నుండి తన కారులో వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











