పవన్ కళ్యాణ్ కోసం రాబోతున్న బండ్ల గణేష్.. అలజడి పుట్టించడం కోసం.. కదలి రండి అంటూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సినిమా ఇండస్ట్రీలో చాలా మంది యువ హీరోలు సినీ ప్రముఖులు దర్శకులు ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రత్యేకంగా దైవ సమానంగా అభిమానించే వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బండ్లగణేష్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో రుజువయింది. ఇటీవల భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తారని అనుకుంటే బండ్ల గణేష్ ఎందుకు రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ కు రాజకీయ అడుగులో మొదటిసారి బండ్ల గణేష్ అడుగు వేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

పవన్ తో అనుబంధం

పవన్ తో అనుబంధం


బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకునే గణేష్ ఆ తర్వాత ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా సరికొత్త కెరీర్ ను మొదలు పెట్టాడు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కు ఎలాగైనా మరొక మంచి సక్సెస్ ఇవ్వాలి అని ప్రయత్నం చేసి హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా చేశాడు. ఆ సినిమా సక్సెస్ కావడంతో బండ్లగణేష్ ఒక్కసారిగా మారిపోయింది.

జనసేన కోసం బండ్ల గణేష్

జనసేన కోసం బండ్ల గణేష్

ఇక బండ్ల గణేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా పవన్ కళ్యాణ్ పేరు తలచుకోకుండా ఉండలేడు. సోషల్ మీడియాలో నిత్యం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంటాడు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించబోయే భారీ కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొనన్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బండ్లగణేష్ తెలియజేశాడు.

భీమ్లా ఈవెంట్ కోసం..

భీమ్లా ఈవెంట్ కోసం..

అసలైతే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతి సినిమా వేడుకలో తన స్పీచ్ తో అదరగొడతాడు అని చాలా సార్లు రుజువు అయ్యింది. గబ్బర్ సింగ్ సినిమా నుంచి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పే ప్రతి ఒక్క కామెంట్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. రీసెంట్గా భీమ్లా నాయక్ ఈవెంట్ కు బండ్ల గణేష్ వస్తాడు అని అందరూ అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ బండ్ల గణేష్ రాలేకపోయాడు. ఆ విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నప్పటికి ఎవరు సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక

ఇక మొత్తానికి చాలా రోజుల తర్వాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీకి సంబంధించిన వేడుకల్లో పాల్గొన్న క్లారిటీ ఇచ్చాడు. మార్చి 14 న గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో బండ్ల గణేష్ పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో బండ్లగణేష్ క్లారిటీ ఇచ్చాడు.

 అలజడి పుట్టించడం కోసం

అలజడి పుట్టించడం కోసం


వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం⁦.. అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నాడు.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
 జనసేన జెండా రెపరెపలాడాలి..

జనసేన జెండా రెపరెపలాడాలి..


అంతే కాకుండా మరొక ట్వీట్ లో 'దేవర జెండా కి కర్రనౌతా.. దేవర రధచక్రానికి కీలునౌతా' అంటూ.. ఇచ్చాపురం నించి హిందూపురం దాకా.. తడ నించి బెజవాడ దాకా.. జనసేన జెండా రెపరెపలాడాలి.
జనసేనాని జపం మారుమ్రోగాలి.. అని బండ్ల గణేష్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X