For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bandla Ganesh: తివిక్రమ్ ను తిట్టింది నేనే.. అలా చేస్తే కోపం రాదా.. ఆడియో లీక్‌పై బండ్ల గణేష్ షాకింగ్

  |

  చిత్రసీమలో ముందుగా నటులుగా వచ్చి తర్వాత పెద్ద నిర్మాతలుగా మారిన వారున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఒకరు. సినిమాలతోపాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న ఆయన డైలాగ్ లకు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడప్పుడు ఆయన మాట్లాడిని మాటలు వివాదాలకు కూడా తెర తీశాయి. ఈ క్రమంలో డైరెక్టర్ తివిక్రమ్ ను బండ్ల గణేష్ తిట్టినట్లుగా ఒక ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ మాటలు తనవి కావన్న బండ్ల గణేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనే మాట్లాడినట్లుగా చెప్పి ఆశ్చర్యపరిచాడు.

  తీన్ మార్ సినిమాతో నిర్మాతగా..

  తీన్ మార్ సినిమాతో నిర్మాతగా..

  బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగా మంచి గుర్తింపును అందుకున్నాడు. మొదట పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అతను ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లతో కూడా సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్ ఆ తరువాత పలు వ్యాపారలతోనే ఎక్కువగా బిజీగా మారిపోయాడు.

  అన్యాయంగా మాట్లాడితే మాత్రం ..

  అన్యాయంగా మాట్లాడితే మాత్రం ..

  నిర్మాతగా చాలా గ్యాప్ ఇచ్చిన బండ్ల గణేష్ ప్రస్తుతం మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివిధ రకాల అంశాలపై స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం అప్పుడే వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే అన్యాయంగా మాట్లాడితే మాత్రం నేను కూడా కౌంటర్ ఇస్తాను అని చెబుతున్నాడు.

  బండ్ల గణేష్ డైలాగ్ లకు విపరీతమైన ఫ్యాన్ బేస్..

  బండ్ల గణేష్ డైలాగ్ లకు విపరీతమైన ఫ్యాన్ బేస్..

  అంతేకాకుండా బండ్ల గణేష్ పేరు చెబితే గుర్తుకువచ్చేది పవర్ స్టార్ పవన్ కల్యాణే. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్ల గణేష్ చెప్పే డైలాగ్ లకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో స్పీచ్ తో బండ్ల గణేష్ సిద్ధంగా ఉన్నాడు. కానీ మధ్యలో గణేష్ ను తివిక్రమ్ రానివ్వలేదని టాక్ వచ్చింది. దీంతో తివిక్రమ్ పై సీరియస్ అయ్యాడు బండ్ల గణేష్. వాడు, వీడు అంటూ తిడుతూ రెచ్చిపోయిన ఆడియో ఒకటి బయటకు కూడా వచ్చింది. అప్పుడు అవి తన మాటలు కాదని బండ్ల గణేష్ చెప్పాడు.

  ఆ వాయిస్ నాదే.. కానీ..

  ఆ వాయిస్ నాదే.. కానీ..

  అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఈ విషయంపై ప్రస్తావించగా అసలు విషయం తెలిపాడు. ''ఆ ఆడియోలో వాయిస్ నాదే. దాంట్లో అబద్ధం చెప్పడం ఎందుకు. ఏదో కోపం వచ్చింది అన్నాను. తర్వాత సారీ కూడా చెప్పాను'' అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. అలాగే ఆ ఆడియోలో ''బండ్లన్న రావాలి అని ఎందుకు అన్నారు'' అని అడిగిన ప్రశ్నకు ''ఆ వాయిస్ మాత్రం నాది కాదు'' అంటూ సమాధానం ఇచ్చాడు బండ్ల గణేష్.

  మనిషన్నోడికి కోపం రాదా..

  మనిషన్నోడికి కోపం రాదా..

  తర్వాత ''కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. అంతమాత్రానా విడిపోం. పాలపొంగు ఏంటండి. మనిషన్నోడికి కోపం రాదా. ఫలానా కోపానికి ఫలానా హద్దు ఉండాలి అని నువ్ రాసియ్యు'' అంటూ యాంకర్ పై అసహనం వ్యక్తం చేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే మొదట నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

  వెంటనే వెనుకడుగు..

  వెంటనే వెనుకడుగు..


  ఇక మధ్యలో రాజకీయాల్లో కూడా ఒక అడుగు వేసిన పండ్ల గణేష్ తర్వాత మళ్లీ వెంటనే వెనుకడుగు వేశాడు. ఇక ప్రస్తుతం బిజినెస్ లతోనే కొనసాగుతున్న గణేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని కామెంట్లతో కూడా వైరల్ గా మారుతున్నారు. తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూల్లో ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాడు. అలాగే ఇదే ఇంటర్వ్యూలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ పూరి అనే వాడికి మంచి చెడు చెప్పే రైట్ నాకుంది.. నా ఫ్రెండ్.. పెట్టు ఫోన్.. అంటూ సీరియస్ గా మాట్లాడాడు బండ్ల గణేష్.

  English summary
  Bandla Ganesh Clarity On His Leaked Audio Over Abusing Trivikram In Leaked Audio
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X