చిరు 150వ సినిమా: బండ్ల గణేష్, టీవీ ఛానల్ ఓనర్ కూడా?

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడనే విషయంలో తప్పు.....ఇతర ఏ విషయాల్లోనూ సరైన సమాచారం, క్లారిటీ లేదు. మెగా ఫ్యామిలీ హీరోలను ఈ విషయమై ఎప్పుడూ ప్రశ్నించినా....కథ ఓకే కాలేదు, త్వరలోనే అన్ని వెల్లడిస్తామని గత మూడేళ్లుగా విషయాన్ని నెట్టూకొస్తూ వస్తున్నారు.

తాజాగా మెగా ఫ్యామిలీ క్లోజ్ సోర్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ చిత్రానికి రామ్ చరణ్ ముఖ్య నిర్మాత కాగా... బండ్ల గణేష్, ఓ టీవీ ఛానల్ ఓనర్ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారనే ప్రచారం సాగుతోంది. సదరు టీవీ ఛానల్ ఓనర్ ఎవరు? అనేది ఇంకా బయటకు రాలేదు.

 Bandla Ganesh co-produce Chiranjeevi's 150th Film

మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ వార్తల ప్రకారం....రచయిత బివిఎస్ రవి ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. మరో వైపు దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం పూరి జ్యోతిలక్ష్మి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారని, చిరంజీవి 150వ సినిమా కోసం పూరి కూడా ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఇలా రకరకాల వార్తలు, రకరకాల ప్రచారాలు అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప....ఈ అయోమయానికి తెరపడే అవకాశం కనిపించడం లేదు.స

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X