జై పవన్‌ కళ్యాణ్.. మరోసారి రంగంలోకి బండ్ల గణేష్.. తగిన ఆధారం చూపుతూ!!

సినీ ఇండస్ట్రీలో పవన్‌ కళ్యాణ్- బండ్ల గణేష్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కోసం తాను ప్రాణాలైనా ఇస్తానని పలుసార్లు బాహాటంగా ప్రకటించాడు బండ్ల గణేష్. ఈ మేరకు పవన్, జనసేన పార్టీ పెట్టిన కొత్తలో తన సపోర్ట్ కూడా తెలిపాడు. ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ పవన్‌పై ఉన్న అభిమానాన్ని మాత్రం అలాగే ఉంచేశాడు. తాజాగా మరోసారి రంగంలోకి దిగి పవన్ ఇష్యూ బయటకు తీశాడు బండ్ల గణేష్. వివరాల్లోకి పోతే..

ఎన్నికల్లో బ్లేడు హంగామా.. యూ టర్న్

ఎన్నికల్లో బ్లేడు హంగామా.. యూ టర్న్

సక్సెస్ సంగతి అటుంచితే.. సినీ నటుడి గానూ, రాజకీయ వేత్త గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత నిర్మాతగా మారి.. రాజకీయరంగంలోకి కూడా దిగేశాడు ఈ కమెడియన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెగ హంగామా చేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఈయన.. ఎలక్షన్స్ అనంతరం సైలెంట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు తిరిగి మరో యూ టర్న్ తీసుకునే దిశగా బండ్ల గణేష్ అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

పవన్ రీ ఎంట్రీ.. బండ్ల గణేష్ కన్ను

పవన్ రీ ఎంట్రీ.. బండ్ల గణేష్ కన్ను

ఇకపోతే రెండేళ్ల పాటు రాజకీయాలతో బిజీ అయిన పవన్.. తిరిగి ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాతో పవన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదలై సరికొత్త రికార్డులు సృష్టించింది.

 క్రిష్ దర్శకత్వంలో మరో మూవీ..

క్రిష్ దర్శకత్వంలో మరో మూవీ..

ఇదిలా ఉండగానే క్రిష్ దర్శకత్వంలో మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అతిత్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పవన్ సినిమాల అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

పవన్ కళ్యాణ్ సినిమాకి బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు?

పవన్ కళ్యాణ్ సినిమాకి బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు?

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాకి బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు? అంటూ ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోల్ నిర్వహించాడు. దీనికి ఏఎం రత్నం, దిల్‌ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్‌, బండ్ల గణేశ్‌ అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో బండ్ల గణేష్ పైనే అందరూ మొగ్గు చూపారు.

స్క్రీన్‌ షాట్‌ తీసి మరీ చూపిన బండ్ల గణేష్

స్క్రీన్‌ షాట్‌ తీసి మరీ చూపిన బండ్ల గణేష్

ఏఎం రత్నంకు 14 శాతం, బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు 8 శాతం, బండ్ల గణేశ్‌కు 51 శాతం, దిల్‌ రాజుకు 27 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఇది చూసి బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు చాలా మంది ఓటు వేశారని చెబుతూ సదరు స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. అంతేకాదు 'జై పవన్‌ కళ్యాణ్' అంటూ ట్యాగ్ చేశాడు.

Recommended Video

Bandla Ganesh Sketch To Enter Into Janasena Party || Filmibeat Telugu

నా దైవానికి విశ్వాస పాత్రుడిని: బండ్ల గణేష్

'మీ అభిమానానికి కృతజ్ఞుడిని. ఎల్లవేళలా నా దైవానికి విశ్వాస పాత్రుడిని' అంటూ బండ్ల గణేశ్ పేర్కొన్నారు. ఇకపోతే గతంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిర్మాత బండ్ల గణేశ్ ఎంతగా పొగడ్తల వర్షం కురిపించేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే బండ్ల గణేష్- పవన్ కాంబోలో మరో సినిమా రావడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X