Bandla Ganesh: కాంగ్రెస్ గెలుపుతో బండ్లన్నకు రేపే దీపావళి, రంజాన్, క్రిస్మస్‌లు.. 89 సీట్లు కావాలట!
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎవరు సీఎం అవుతారని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కంటే కూడా అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చూస్తున్నారు. ముఖ్యంగా అంతా కాంగ్రెస్ యే గెలిచే అవకాశం ఉన్నట్లు భావిస్తుండగా.. కాంగ్రెస్ యే ఆధిక్యంలో ఉంది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ గెలుపు ఖాయం అని అర్థం అవుతుంది. ఇదంతా ఇలా ఉండగా.. ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో రాబోతుందని.. టీపీసీసీ చీఫ్ యే రేవంత్ రెడ్డియే తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అంటూ వివరించారు. అలాగే డిసెంబర్ 7వ తేదీ సాయంత్రమే తాను ఎల్బీ స్టేడియానికి వెళ్లి పడుకుంటానని అన్నారు. అంతేకాకుండా అందుకోసం ఇప్పటికే దుప్పటి కూడా రెడీ చేసుకున్నట్లు వెల్లడించాడు. శనివారం రోజు ఉదయం 9 గంటలకు ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. కచ్చితంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అయితే ఆయన చెప్పిన మాటలకు తగ్గట్లుగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండడంతో తాజాగా మరోసారి అదిరిపోయే కామెంట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో తాను రేపే దీపావళి, రంజాన్, క్రిస్మస్ పండుగలతో పాటు గురునానక్ జయంతిని కూడా నిర్వహించుకోబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్.. 89 సీట్లు గెలుచుకోవోలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. అన్ని రాకపోయినా కాంగ్రెస్ యే సర్కారును ఫాం చేస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు.
అలాగే కాంగ్రెస్ గెలిచిందని తెలియగానే సంబురాలు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు బండ్ల గణేష్. ముఖ్యంగా పెద్ద ఎత్తున టపాసులు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. వాటి ముందు కూర్చొని ఫొటోలు దిగిన ఆయన సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేస్తూ.. పైన చెప్పిన విషయాలను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ కు సంబంధించిన ఈ ఫొటోలు, కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.
అంతేకాకుండా ఈనెల 9వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే... తాను ఎల్బీ స్టేడియంలో కూర్చొని చప్పట్లు కొడుతూ ఉంటానని బండ్ల గణేష్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే ఆ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి అధికారం చేపట్టబోతున్నట్లు పునరుద్ధాటించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











