Bandla Ganesh: ప్రాణం పోయినా అలా చేయనన్న బండ్ల గణేష్.. రోజాతో దిగిన ఫొటోతో స్ట్రాంగ్ కౌంటర్లు!
చిత్రసీమలో ముందుగా నటులుగా వచ్చి తర్వాత పెద్ద నిర్మాతలుగా మారిన వారున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఒకరు. సినిమాలతోపాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న ఆయన డైలాగ్ లకు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు, ట్వీట్లు వివాదాస్పదం అవుతుంటాయి.
తాజాగా తారకరత్న మరణ వార్తతో కుటుంబీకులు, అభిమానులు శోకసంద్రంలో ఉంటే ఆయన పార్థీవ దేహం దగ్గరిలో కలిసి మాట్లాడుకుంటున్న చంద్రబాబు నాయుడు, విజయ సాయి రెడ్డి ఫొటోపై కామెంట్స్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు నెటిజన్లు సైతం విరుచుకుపడుతున్నారు.

స్టార్ హీరోలతో సినీ నిర్మాణం..
బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగా మంచి గుర్తింపును అందుకున్నాడు. మొదట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీన్ మార్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు.
అనంతరం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లతో కూడా సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్ ఆ తరువాత పలు వ్యాపారలతోనే ఎక్కువగా బిజీగా మారిపోయాడు.

కౌంటర్ ఇస్తా అంటూ..
నిర్మాతగా చాలా గ్యాప్ ఇచ్చిన బండ్ల గణేష్ ప్రస్తుతం మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివిధ రకాల అంశాలపై స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం అప్పుడే వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే అన్యాయంగా మాట్లాడితే మాత్రం తాను కూడా కౌంటర్ ఇస్తాను అని చెప్పేవారు. ఇక ఆ మధ్లో రాజకీయాల్లకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ తర్వాత వెనకడుగు వేశారు.

శత్రువుతో అలా..
ప్రస్తుతం బిజినెస్ లతోనే కొనసాగుతున్న గణేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని కామెంట్లతో కూడా వైరల్ గా మారుతున్నారు. ఇటీవల నందమూరి తారక రత్న మరణించగా ఆయన పార్థీవ దేహాన్ని ఆయన నివాసంలో ఫిబ్రవరి 19న ప్రముఖుల సందర్శానర్థం ఉంచిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో నారా చంద్రబాబు నాయుడుకు రాజకీయాల్లో శత్రువుగా భావించే విజయ సాయి రెడ్డి అక్కడకు వచ్చారు. ఆయన్ను చంద్రబాబు పరామర్శిస్తూ ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది.

బతికితే సింహంలా బతకాలి..
విజయ సాయిరెడ్డి, చంద్రబాబు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కామెంట్స్ చేశారు బండ్ల గణేష్. అందులో "నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చుని మాట్లాడను. అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతా. అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి. చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి" అని రాసుకొచ్చారు.

అర్థం లేకుండా మాట్లాడకు..
బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై అభిమానులతో పాటు నెటిజన్లు సైతం విరుచుకుపడుతున్నారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు సమయం, సందర్భం చూసి మాట్లాడాలి. అక్కడ పరిస్తితి ఏంటి అంటూ బండ్ల గణేష్ ను తిరిగి ప్రశ్నిస్తున్నారు. తారకరత్న విజయ సాయిరెడ్డి అల్లుడు. నందమూరి వారసుడు. అర్థం లేకుండా మాట్లాడకు అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా రోజాతో బండ్ల గణేష్ దిగిన ఫొటోను పోస్ట్ చేసి కౌంటర్లు ఇస్తున్నారు.

రోజాతో ఫొటోషూట్ ఏంటీ..
పవన్ కల్యాణ్ విషయంలో ఒక సారి లైవ్ లో బండ్ల గణేష్, రోజా పరస్పరం వాదించుకుంటూ తిట్టుకున్నారు. అయితే ఇలా మీరు తిట్టుకుని మళ్లీ ఆమెతో ఫొటోలు దిగడం ఏంటీ, పైగా నీతులు చెబుతున్నారు అంటూ బండ్ల గణేష్ ను ట్రోల్ చేస్తున్నారు. రోజాతో గణేష్ దిగిన ఫొటోను షేర్ చేస్తూ "అమ్మ నా బూతులు తిట్టుకుని.. అది కూడా ఒకరికి ఒకరు పధకాలు వేస్తారా అని అడిగి.. మళ్లీ రోజాతో నువ్వు ఫొటోషూట్. పైగా నీతులు" అని రాసుకొచ్చారు. ఇలా బండ్ల గణేష్ పై నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు.


Click it and Unblock the Notifications











