twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హల్చల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్.. నందమూరి వారిపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

    |

    హోళీ పండగ సందర్బంగా తన ఫ్యామిలీ పిక్ షేర్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన ఇద్దరు కొడుకులు, భార్యతో కలిసి హోళీ సంబరాల్లో మునిగితేలిన ఎన్టీఆర్.. వాళ్ళతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ అందరికీ హోళీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ ఫ్యామిలీ పిక్ చూసిన బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందిస్తూ కామెంట్ చేశాడు. వివరాల్లోకి పోతే..

    హోళీ స్పెషల్.. ఎన్టీఆర్ సర్‌ప్రైస్

    హోళీ స్పెషల్.. ఎన్టీఆర్ సర్‌ప్రైస్

    హోళీ పండగ సందర్భంగా తన ఫ్యామిలీ పిక్‌తో సర్‌ప్రైస్ చేశారు ఎన్టీఆర్. ఆయన షేర్ చేసిన ఈ పిక్‌లో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు తెలుగు రెండు దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో ఈ ఫోటో చూసిన పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

    అందుకున్న హరీష్ శంకర్.. వెంటనే!

    అందుకున్న హరీష్ శంకర్.. వెంటనే!

    ఈ పిక్ చూసిన మరుక్షణమే డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఆలోచనను పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఎన్టీఆర్.. చిన్న కొడుకు భార్గవ్ రామ్‌పై కామెంట్ చేశారు. ''వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు.. లిటిల్ యంగ్ టైగర్ ఆన్ ది వే'' అని కామెంట్స్ చేశారు. దీంతో అందరిలోనూ ఆలోచన పుట్టింది.

     బండ్ల గణేష్ రియాక్షన్.. నందమూరి వారిలో!

    బండ్ల గణేష్ రియాక్షన్.. నందమూరి వారిలో!

    ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ చూసిన నటుడు బండ్ల గణేష్ కూడా తనదైన కోణంలో రియాక్ట్ అయ్యారు. ''నందమూరి నాలుగో తరానికి డోకా లేదని హోలీ సందర్భంగా తెలియజేసిన మా యంగ్ టైగర్‌కి శుభాకాంక్షలు'' అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

    Recommended Video

    Jr NTR's Kid Bhargava Ram Grabing Attention In Social Media || Filmibeat Telugu
     బండ్ల గణేష్ ట్వీట్.. కారణమిదే!

    బండ్ల గణేష్ ట్వీట్.. కారణమిదే!

    నిజానికి నందమూరి తారక రామారావు మొదలుకొని నేటి తరం వరకు అందరు నందమూరి వారసులు సినీ, రాజకీయ రంగాల్లో తమదైన మార్క్ చూపించారు. నందమూరి బాలకృష్ణ ఇటు సినిమా అటు రాజకీయం రెండు రంగాల్లో దూసుకుపోతుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ రంగంలో టాప్ స్టార్‌గా వెలిగి పోతున్నారు. ఈ లెక్కన నెక్స్ట్ తరంలో యంగ్ టైగర్ వారసులదే హవా అని చెప్పకనే చెప్పేశారు బండ్ల గణేష్.

    యంగ్ టైగర్ RRR

    ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ తన RRR సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చేస్తూనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యంగ్ టైగర్.

    English summary
    N. T. Rama Rao Jr sheres his family pic in social media and tells Holi wishes to audians. Now actor, producer Bandla Ganesh commented on NTR family photo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X