ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ : వామ్మో అట్టా ఇట్టా కాదు పగిలిపోయింది.. బండ్ల గణేష్ ట్వీట్స్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20)కు ఎలాంటి సర్‌ప్రైజ్ లేదని నిరాశ పడిన అభిమానులకు కళ్లు చెదిరిపోయేలా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది వరకెన్నడూ చూడని ఎన్టీఆర్‌ను పరిచయం చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయేలా ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ ఫోటో షూట్ చేసింది బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ. సిక్స్ ప్యాక్ బాడీ ట్రెయిన్ చేసింది లాయడ్ స్టీవెన్. మొత్తానికి ఎన్టీఆర్ పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. ఈ పిక్‌ను రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో దుమ్ములేపింది. ఈ ఫోటోపై టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ స్పందించారు.
Recommended Video

బండ్ల గణేష్ ప్రత్యేకం..
ఎన్టీఆర్‌ను సిక్స్ ప్యాక్‌లో చూసిన బండ్ల గణేష్ తెగ సంబరపడిపోయినట్టున్నాడు. వరుస ట్వీట్లతో తెగ సందడి చేస్తున్నాడు. సినిమా డైలాగ్‌లతో ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేస్తున్నాడు. ఆ ట్వీట్స్ సంగతేంటో ఓ సారి చూద్దాం.

దీనమ్మ జీవితం..
ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోను షేర్ చేస్తూ.. వామ్మో దీ.. జీవితం సూపర్ యంగ్ టైగర్ అదిరిపోయింది, ఫాస్టెస్ట్ మిలియన్ ట్వీట్స్‌పై స్పందిస్తూ.. బ్రతకాలంటే బాద్‌షా కిందుండాలి, చావాలంటే బాద్‌షా ముందుండాలని పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ట్వీట్స్ చేశాడు.

బాద్‌షా డైలాగ్స్‌తో..
బండ్ల గణేష్ నిర్మించిన బాద్‌షా సినిమాలోని డైలాగ్‌లతో ఎన్టీఆర్‌ను పొగడటం వైరల్ అవుతోంది. భయపడే వాడు బానిస.. భయపెట్టేవాడు బాద్‌షా, వామ్మో అట్టా ఇట్టా కాదు పగిలిపోయింది.. బెదిరిపోతున్నారు అంటూ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను కనబర్చాడు.

చచ్చిన జంతువును సింహం ముట్టదు..
మరో ట్వీట్‌లో చచ్చిన జంతువును సింహం ముట్టదు.. భయపడే మనిషిని బాద్‌షా చంపడు.. బాద్‌షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది.. అయ్య డిసైడ్ అయ్యాడు.. అందుకే వన్ సైడ్ చేశాడు. బాద్‌షా, టెంపర్ చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్.. ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను ఇలా ట్వీట్ల రూపంలో చూపుతూ బర్త్ డే విషెస్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











