పవన్ కళ్యాణ్ భరిస్తాడు, బరితెగిస్తాడు, ఆయనపై నా ఆశ నెరవేర కూడదు: బండ్ల గణేష్

Recommended Video

Bandla Ganesh Said That He Want To See Pawan Kalyan As A CM || Filmibeat Telugu

రాజకీయాల నుంచి తప్పకున్నట్లు ప్రకటించిన నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నాలాంటి వారికి సరిపడవని, అక్కడ ఉంటే శత్రువులను తయారు చేసుకోవడం, స్నేహితులను దూరం చేసుకోవడమే అన్నారు.

అనవసరంగా అందులో నుంచి బయటకు వచ్చారేమో? అని దయచేసి నా ముందు అనొద్దు. ఇలాంటి మాటలతో మళ్లీ నన్న చెడగొట్టవద్దు, నేను రాజకీయాలు వదిలేసి హాయిగా బ్రతుకుదామనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ భరిస్తాడు, బరితెగిస్తాడు

పవన్ కళ్యాణ్ భరిస్తాడు, బరితెగిస్తాడు

‘రాజకీయాల్లో అన్ని రకాల పరిస్థితులను చిరంజీవిగారు తట్టుకోలేరు, మా బాస్ పవర్ స్టార్ తట్టుకుంటాడు. ఆయన భరిస్తాడు.. బరితెగిస్తాడు. అదీ పవర్ స్టార్ అంటే. కానీ చిరంజీవి అలా చేయలేరు. ఆయన చాలా సౌమ్యమైన,, సాధవు లాంటి వ్యక్తి' అని గణేష్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మంచి చేస్తే చెపొద్దా?

కేసీఆర్ మంచి చేస్తే చెపొద్దా?

‘నేను కేసీఆర్‌ను పొగడటం అంటే మా పౌల్ట్రీ ఇండస్ట్రీకి మంచి పనులు చేశారని అంటున్నాను. కరెంట్ విషయంలో, కోళ్ల దానా మొక్కజొన్న తక్కువ రేటుకే మాకు అందేలా చేస్తున్నారు. మేం కష్టాల్లో ఉన్నపుడు సాయం చేశారు. అలాంటివి చెప్పొద్దు అంటే ఎలా?' అని బండ్ల గణేష్ ప్రశ్నించారు.

డబ్బులు మిగిలే కథ దొరికితే సినిమాలు తీస్తా

డబ్బులు మిగిలే కథ దొరికితే సినిమాలు తీస్తా

సినిమాలు మళ్లీ తీస్తారా? అనే ప్రశ్నకు బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘మంచి సినిమా దొరికి డబ్బులు మిగులుతాయంటే తీస్తా. డబ్బులు మిగలని సినిమా తీయడం నా వల్ల కాదు. రిస్క్ చేయడం ఎందుకు? ఇపుడు హ్యాపీగా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం బాక్సులు ఓపెన్ అవుతాయి. ఫలితం తేలిపోయింది. కానీ రాజకీయాల్లో అలా కాదు. ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు వస్తుందో రాదో కూడా తెలియదు.' అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండవు

సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండవు


‘‘సినిమా ఇండస్ట్రీలో నేను రాజకీయాలు చేస్తాను అనడంలో నిజం లేదు. అలాంటి అక్కడ కుదరవు. ఇక్కడ టాలెంట్ ఉంటేనే పైకి వస్తారు. రాజకీయాలు చేస్తే ఎవరూ పైకి రారు అని స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్న వారిని తొక్కేస్తారనేది కేవలం ఆరోపణలే'' అన్నారు.

ఇక్కడ రుద్దడం కుదరదు

ఇక్కడ రుద్దడం కుదరదు

సినిమా ఇండస్ట్రీలో వారసులే నెగ్గుకొస్తారనేది నిజం కాదు. వారసులుగా ఉండి సక్సెస్ కాని వారు చాలా మంది ఉన్నారు. టాలెంట్ లేకుంటే ఏ స్టార్ కొడుకు ఎదగడు.. కానీ రాజకీయాల్లో టాలెంట్ లేకున్నా పదువులు ఇస్తారు, ప్రజలపై రుద్దబడతారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంత రుద్దినా ఒక సినిమాకు, రెండు సినిమాలకు రుద్దుతారు. తర్వాత రుద్దడం సాధ్యం కాదని తెలిపారు.

పవన్ కళ్యాణ్ విషయంలో నా కోరిక నెరవేరొద్దు

పవన్ కళ్యాణ్ విషయంలో నా కోరిక నెరవేరొద్దు

మా బాస్ పవన్ కళ్యాణ్‌ను పెట్టి సినిమా చేసే ఆలోచన ఇపుడు లేదు. ముందు ఆయన యజ్ఞం పూర్తి కానివ్వండి. నాకు ఆయనతో సినిమా తీయాలని ఆశ ఉంది. కానీ నా ఆశ నెరవేరకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన్ను నేను ఓ స్థాయిలో (సీఎం) చూడాలనుకుంటున్నట్లు బండ్ల గణేస్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X