twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంత చెప్పినా ఎవ్వరూ వినడం లేదు.. వదలిపెట్టని రూమర్లు.. దండం పెట్టిన బండ్ల గణేష్!!

    |

    బడా ప్రొడ్యూసర్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో రాంగ్ స్టెప్ వేశాడు. రాజకీయాల్లోకి వచ్చి అతి పెద్ద తప్పు చేశాడు. ఇక పాలిటిక్స్‌లోకి వచ్చాక బురద అంట కుండా ఉంటుందా? రాజకీయాల్లో నుంచి తప్పుకున్నాను నన్ను వదిలేయండి అని మొరపెట్టుకున్నా నీడలా వెంటాడుతూనే ఉంటుంది ఆ గతం. ఇప్పుడు బండ్ల గణేష్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కొందరు పనిగట్టుకుని బండ్లన్నపై బురద జల్లే ప్రయత్నం చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

    గతం వెంటాడుతోంది..

    గతం వెంటాడుతోంది..

    బండ్ల గణేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి వాగిన వాగుడంతా ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్‌కు కనువిప్పు కలిగింది. రాజకీయాల వల్ల కొందరికి దూరం కావాల్సి వస్తోంది.. అసలు ఈ రాజకీయాలే వద్దని స్వస్తిపలికాడు. మళ్లీ సినిమానే జీవితమని చెప్పాడు. సినిమాలతోనే బిజీగా గడపాలని ఫిక్స్ అయ్యాడు.

    భారీ ప్రాజెక్ట్‌లు..

    భారీ ప్రాజెక్ట్‌లు..

    సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడంతో బండ్ల గణేష్ పరువుపోయినట్టైంది. అలాంటి పాత్రలు ఎందుకు చేశావ్ అని తన పిల్లలే నిలదీశారట. అందుకే ఇకపై నటించడం కంటే సినిమాలను నిర్మించడమే మంచిదని ఫిక్స్ అయ్యాడట. అందుకు భారీ సినిమాలను నిర్మించే క్రమంలో పవన్ కళ్యాణ్‌తో ఓ ప్రాజెక్ట్‌కు కర్చీప్ వేసుకున్నాడు.

    ఈలోపు అలాంటి రూమర్లు..

    ఈలోపు అలాంటి రూమర్లు..

    అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా గత కొన్ని రోజులుగా బండ్లన్న రాజకీయ ఎంట్రీపై పలు రకాల రూమర్లు వస్తున్నాయి. బీజేపీలో చేరబోతోన్నాడని గుసగులసు వినిపించాయి. ఈ రూమర్లను ఖండిస్తూ రెండ్రోజుల క్రితం ఓ పోస్ట్ చేశాడు.

    నా అభ్యర్థన..

    నా అభ్యర్థన..

    నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ అంటూ అందరినీ వేడుకున్నాడు. అయినా సరే రూమర్లు ఆగడం లేదు. అవి అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో మరో సారి స్పందించాడు.

    Recommended Video

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
    రాజకీయాలకు దూరం..

    రాజకీయాలకు దూరం..

    మళ్లీ రాజకీయాల్లో బండ్ల్ గణేష్ రాబోతోన్నాడని అందరూ గుసగుసలు పెడుతూ రూమర్లను వ్యాప్తి చేస్తున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. బండ్ల గణేష్ ఈసారి ఏకంగా దండం పెట్టేశాడు. నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం. అంటూ దండం పెట్టేశాడు. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

    English summary
    Bandla Ganesh Condemns About Political Re entry..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X