రామ్ చరణ్ తో చిత్రం గురించి బండ్ల గణేష్
గణేష్ మాట్లాడుతూ.... 'ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణవంశీ వినూత్న కథాంశాన్ని తయారుచేశారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. వెంకటెష్ రామ్‌చరణ్‌లాంటి స్టార్ హీరోల కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని అతి త్వరలో తెలియజేస్తాం' అన్నారు.
ఈ విషయమై వెంకటేష్ స్పందిస్తూ...మంచి కథలొస్తే తప్పకుండా చేస్తా. సోలో హీరోగా రెండు సినిమాలు చేస్తే.. ఒకటి మరో హీరోతో కలసి చేస్తా. త్వరలో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నా. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారు అని చెప్పి ఖరారు చేసారు. ఆ చిత్రంలో వెంకటేష్, రామ్ చరణ్ మామా,మేనల్లుడు లు లాగా కనపడనున్నట్లు సమాచారం. ఆయన హీరోగా నటించిన 'మసాలా' ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో హీరో హీరోయిన్లుగా నయనతార, కాజల్ అగర్వాల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. గతంలో వెంకీ-నయతార లక్ష్మి, తులసి చిత్రాల్లో నటించారు. రామ్ చరణ్-కాజల్ మగధీర, నాయక్ చిత్రాల్లో నటించారు. వీరి మధ్య ఆయా చిత్రాల్లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ హీరోయిన్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రం స్టోరీ లైన్ హిందీ మూవీ 'కభి ఖుషీ కభి ఘమ్' స్టోరీని పోలి ఉంటుందట. ఏది ఏమైనా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే వెంకటేష్-మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మంచి విజయం సాధించింది. మరో వైపు వెంకటేష్-రామ్ మల్టీ స్టారర్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పుడు వెంకటేష్-రామ్ చరణ్ మల్టీ స్టారర్ కూడా ఫైనలైజ్ అయింది. వెంకటేష్ తనకోసం ఇలాంటి మల్టీస్టారర్ స్టోరీలు అడిగి మరీ తయారు చేయించుకుని, యంగ్ హీరోలతో చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications












