ఎదో ఒకరోజు తలపగిలి చచ్చిపోతాడు.. RGV పవర్ స్టార్ పై బండ్ల గణేష్ కౌంటర్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి పవర్ స్టార్ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కోవిడ్ 19 ఇబ్బందుల్లో కూడా అనుకున్నట్టుగా సినిమాను తెరకెక్కించి తన కాంట్రవర్సీ స్టైల్ లోనే సినిమాను రిలీజ్ చేశాడు. ఇక అందులో బండ్ల గణేష్ పాత్రను గుండ్ల రమేష్ గా చూపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వివాదంపై బండ్ల గణేష్ మొదటిసారి స్పందించాడు.

గుండ్ల రమేష్ పాత్రపై..

గుండ్ల రమేష్ పాత్రపై..

పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి బాక్సాఫీస్ హిట్ అందుకున్న బండ్ల గణేష్ పవర్ స్టార్ ని ఎంతగా ఆరాదిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే వర్మ బండ్ల గణేష్ పాత్రను పవర్ స్టార్ సినిమాలో కామెడీగా చూపించడం సోషల్ మిడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై బండ్ల గణేష్ ఆర్జీవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

స్పందించాలని అనుకున్నా..

స్పందించాలని అనుకున్నా..

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నాలుగైదు సార్లు RGV పవర్ స్టార్ సినిమా గురించి విన్నాను. స్పందించాలని కూడా అనుకున్నా. అయితే అలాంటి టైమ్ లో నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నా చిన్న తనంలో మా ఊర్లో ఒక వ్యక్తి బాగా చదువుకొని కొన్ని రోజులకే పిచ్చోడిలా మారిపోయాడు. అతని గురించి మెల్లగా తెలుసుకున్న జనాలు పట్టించుకోవడం మానేశారు.

వర్మను అలాంటి ఫీలింగ్ తోనే వదిలేశాను..

వర్మను అలాంటి ఫీలింగ్ తోనే వదిలేశాను..

పిచ్చోడు అని తెలియడంతో అతని జోలికి వెళ్లడం మానేశారు. నేను కూడా వర్మను అలాంటి ఫీలింగ్ తోనే వదిలేశాను. అందుకే స్పందించలేదు. ఓ పిచ్చోడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నన్ను తక్కువగా చేసి చూపించడం వల్ల నాకు ఇష్టమైన రామ్ గోపాల్ వర్మకు 100రూపాయలు వస్తే.. ఎంతో హ్యాపీ. కనీసం ఆ వందతో కాఫీ అయినా తాగుతాడు. ఆ తృప్తి నాకు ఉంది.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
తలపగిలి చచ్చిపోతాడు

తలపగిలి చచ్చిపోతాడు

నిద్రపోయినట్లు నటించే వాడిని ఏమి అనలేము. పిచ్చోడిని పిచ్చోడిలా వదిలెయ్యాలి. ఇప్పుడు నేను, తరువాత ఇంకొకడు. ఇలా అందరూ అలానే అనుకుంటారు అయితే ఎదో ఒక రోజు ఇలా రాళ్లు వేస్తూ ఉంటే అతనే తల పగిలి చచ్చిపోతాడు అంటూ బండ్ల గణేష్ రామ్ గోపాల్ వర్మకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X