గోవిందుడు అందరి వాడేలే : కంటతడి పెట్టిన నిర్మాత
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తొలి కాపీ చూసిన అనంతరం ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలను వెల్లడించారు.
‘గోవిందుడు అందరి వాడేలే చిత్రం తొలి కాపీ చూసిన తర్వాత నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఎంత ఎమోషన్ అయినా నా కళ్ల వెంట నీరు రాదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత కన్నీళ్లు ఆగలేదు. నిర్మాతగా నా కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. బాపుగారి దర్శకత్వంలో వచ్చిన అత్యుఉత్తమ సినిమా ‘ముత్యాల ముగ్గు' అయితే......కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే' అత్యుత్తమ చిత్రం అవుతుందని తెలిపారు.

ఈ చిత్రాన్ని తొలి రోజు దాదాపు 1800 నుండి 2000 థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ అమెరికా నుండి ఇండియా తిరిగి వచ్చిన ఎన్నారై యువకుడిగా కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











