Diwali Special.. టపాసుల షాపు పెట్టావా?.. బండ్ల గణేష్ పోస్ట్‌పై సెటైర్స్
బండ్ల గణేష్ గురించి చెప్పాలంటే కరోనా వైరస్ బారిన పడకముందు.. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తరువాత అని రెండు పార్టులుగా చెప్పుకొచ్చాలి. ఎందుకంటే కరోనా వైరస్ బండ్ల గణేష్‌ను పూర్తిగా మార్చేసింది. చావు చివరి అంచుల వరకు వెళ్లానని, జీవితం మొత్తం గుర్తుకు వచ్చిందని ఇలా ఎన్నో ఆలోచనలను తనను వెంటాడాయని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక బండ్ల గణేష్ పూర్తిగా మారిపోయాడు. శాంతస్వరూపుడిగా మారి.. అందరినీ ప్రేమిస్తున్నాడు. సోషల్ మీడియాలో చేతనైన సాయం చేస్తూ ఎందరి మనసులను గెలుచుకుంటున్నాడు.

ఫైర్ బ్రాండ్‌గా..
ఒకప్పుడు బండ్ల గణేష్ ఫైర్ బ్రాండ్‌లా ఉండేవాడు. ఎవరి మీదకైనా సరే వెళ్లేవాడు. నోటిని అదుపులో ఉంచుకునే వాడే కాదు. రాజకీయాల్లోకి వెళ్లాక అది హద్దులు దాటిపోయింది. సినీ రంగంలోని కొంతమందిపై నోరు పారేసుకున్నాడు. ఢీ అంటే ఢీ అంటూ మాటలు వదిలేవాడు. అలా పీవీపీ, హరీష్ శంకర్, రోజాలపై దారుణమైన కామెంట్స్ చేశాడు.

కరోనా తరువాత కామ్..
కరోనా నుంచి బండ్ల గణేష్ కోలుకున్నాక మొత్తం కూల్ అయిపోయాడు. అందరి గురించి మాట్లాడటం వేస్ట్.. అయినా మనం ఎలా ఉంటే అవతల వాళ్లు అలా ఉంటారు.. మనం మాట అనకుండా ఉంటే వాళ్లు అనరు.. అయినా నాకు నా ఫ్యామిలీ ముఖ్యం.. మిగతా గొడవలన్నీ నాకు ఎందుకు అంటూ బండ్ల గణేష్ వేధాంతాన్ని వల్లించాడు. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండని బండ్ల గణేష్ కోరాడు.

చేతనైన సాయం..
బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ బిజీ అయ్యాడు. తెలుగు సోనూ సూద్‌లా బండ్ల గణేష్ మారాడు. అడిగిన వారికి సాయం చేస్తున్నాడు. డబ్బులు ఇస్తున్నాడు.. బుక్స్ కొనిస్తున్నాడు.. ఉద్యోగాలు లేవని బాధపడుతున్న వారిని తనకు తెలిసిన చోట రికమండ్ చేస్తున్నాడు. మొత్తానికి బండ్ల గణేష్ ఇమేజ్ మాత్రం పూర్తిగా మారిపోయింది.
Recommended Video

తాజాగా అలా..
తాజాగా బండ్ల గణేష్ ఓ ఫోటోను షేర్ చేశాడు. తన ఇంట్లో ఉన్న క్రాకర్స్, పటాసులను ఒక దగ్గర తెచ్చిపెట్టినట్టున్నాడు. ఇక వాటిని చూసిన నెటిజన్లు సెటైర్లు వేశారు. షాపు పెట్టావా అన్నా? అడ్రస్ చెప్పు వచ్చి కొంటాం అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయినా బ్యాన్ చేశారు కదా అంత ఎందుకు కొన్నావ్.. కాలుష్యం పెరిగిపోతుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











