గబ్బర్ సింగ్ పవర్‌స్టార్ బిక్ష.. 8 కాదు.. 80 ఏళ్లైనా.. ప్రత్యేకంగా ‘బండ్ల’ గణపతి హోమం

గబ్బర్ సింగ్ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. ఆయన కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలువడమే అందుకు కారణం. గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 8వ ఏడాది కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం ట్రెండింగ్‌గా మారింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ఎమోషనల్‌గా చేసిన ట్వీట్ ఆసక్తిని రేపింది. అలాగే గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన స్పీచ్ వైరల్‌గా మారింది. ఈ విషయాల గురించి వివరాల్లోకి వెళితే...

గబ్బర్ సింగ్ రోజున గణపతి హోమం

గబ్బర్ సింగ్ రోజున గణపతి హోమం

గబ్బర్ సింగ్ సినిమా గురించి ఎమోషనల్‌గా బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ.. అందరూ పుట్టిన రోజున లేదా పెళ్లి రోజున హోమం చేసుకొంటారు. కానీ గబ్బర్ సింగ్ రిలీజ్ రోజున నేను నా కుటుంబ సభ్యులతో గణపతి హోమం చేసుకొన్నాను అంటూ ట్వీట్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెట్టిన భిక్ష. ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి అని మరో ట్వీట్‌లో గణేష్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణఫడి

పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణఫడి

పవన్ కల్యాణ్ గురించి బండ్ల గణేష్ స్పందిస్తూ.. ఈ రోజుల్లో సహాయం పొందిన మరుసటి రోజే ఎదురు తిరిగి వారినే ప్రశ్నిస్తారు. కానీ నేను మాత్రం ఈ జన్మంత పవన్ కల్యాణ్‌కు రుణపడి ఉంటాను. గబ్బర్ సింగ్ చిత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు సినిమా చరిత్రలో గబ్బర్ సింగ్ ఎప్పటికీ ఓ చరిత్ర అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Recommended Video

#8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
తింటే గారెలు.. వింటే రామాయణం.. తీస్తే గబ్బర్ సింగ్

తింటే గారెలు.. వింటే రామాయణం.. తీస్తే గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్ సినిమాపై బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు. తింటే గారెలు తినాలి. వింటే రామాయణం వినాలి. తీస్తే గబ్బర్ సింగ్ తీయాలి. ఇది నా అదృష్టం. జై పవర్ స్టార్. 8 ఏళ్లు కాదు.. 80 ఏళ్ల తర్వాత మన గబ్బర్ సింగ్ గురించి చర్చిస్తారు. పవర్ స్టార్ ఎప్పటికీ చరిత్ర. గబ్బర్ సింగ్ విడుదల రోజున నా బిడ్డలను ఆశీర్వదించండి అంటూ బండ్ల గణేష్ క్రేజీగా ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ ఓ వ్యసనం

పవన్ కల్యాణ్ ఓ వ్యసనం

ఇక పవన్ కల్యాణ్‌కు నిర్మాత బండ్ల గణేస్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో పవన్‌పై ఉండే అభిమానాన్ని ఆయన పలు రకాలుగా చాటుకొన్నారు. గబ్బర్ సింగ్ 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ వ్యసనం. అలవాటు చేసుకొంటే చచ్చే వరకు మరిచిపోలేం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం కురిపించారు.

రికార్డు స్థాయిలో 7 మిలియన్ల వ్యూస్

రికార్డు స్థాయిలో 7 మిలియన్ల వ్యూస్

ఇదిలా ఉండగా, గబ్బర్ సింగ్ చిత్రం 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్ మొదలైంది. కేవలం 34 నిమిషాల్లోనే దాదాపు 1 మిలియన్ ట్వీట్స్ చేశారు. మొత్తంగా రికార్డు స్థాయిలో 7 మిలియన్ల ట్వీట్లు రావడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిత్ర గురించి అభిమానులు తనదైన శైలిలో మాట్లాడుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X