నాకు సంబంధం లేదు, దయచేసి ఆ మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు.. బండ్ల గణేష్ ఎమోషనల్

నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తరువాత నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి ఒక్కసారిగా తన రేంజ్ ని పెంచుకున్నాడు. అయితే నిర్మాతగా కొంత గ్యాప్ ఇచ్చిన గణేష్ ఆ మధ్య రాజకీయాల్లో కాస్త హడావుడి చేసిన విషయం తెలిసిందే. కానీ అక్కడ ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కోవడంతో పాటు సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్ కి గురవ్వాల్సి వచ్చింది. ఇక చాలా రోజుల తరువాత మళ్ళీ ట్రోలింగ్స్ ఒక విజ్ఞప్తి చేశాడు.

హడావుడి బాగానే చేశాడు.. కానీ..

హడావుడి బాగానే చేశాడు.. కానీ..

బండ్లగణేష్ 2015లో చివరగా నిర్మించిన సినిమా టెంపర్. ఇక మళ్ళీ ఆ తరువాత ప్రొడక్షన్ వైపు వెళ్ళకుండా రాజకీయాల వైపు ఒక అడుగు వేసి తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక సభ్యుడిగా కొనసాగాలని ఎన్నికల ప్రచారంలో బాగానే హడావుడి చేశాడు. ఇక వరుస ఇంటర్వ్యూలతో బండ్ల గణేష్ చేసిన రచ్చ ఎవరు మరచిపోలేదని సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ ని చూస్తుంటేనే అర్ధమవుతోంది.

చాలా సార్లు వివరణ ఇచ్చిన గణేష్

చాలా సార్లు వివరణ ఇచ్చిన గణేష్

7'o క్లాక్ బ్లెడ్ ఎంత వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే అధికార పార్టీలపై బండ్లగణేష్ వేసిన పంచ్ లు కౌంటర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది చెప్పి చెప్పిన విషయం తెలిసిందే. అయితే చాలా సార్లు ఆ విషయాలపై బండ్ల గణేష్ స్పందించాడు. మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడను పట్టించుకోనని క్లారిటీగా చెప్పాడు.

ఆ మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు

ఆ మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు

ఇక మరోసారి ట్విట్టర్ ద్వారా కూడా బండ్లగణేష్ వివరణ ఇచ్చాడు. నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన.. అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నాడు. దీంతో ఆ ట్వీట్ వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు ఊహించని విధంగాగా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడంటే..

పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడంటే..

బండ్లగణేష్ మళ్ళీ ఐదేళ్ల అనంతరం సినిమాలు నిర్మించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నట్లు కొన్ని వారాల క్రితం క్లారిటీ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ ఇక నుంచి విభిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక పవన్ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్రివిక్రమ్ లేదా పూరి జగన్నాథ్ ఫిక్స్ కావచ్చనే టాక్ వస్తోంది. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా రావడానికి మరో మూడేళ్ళ సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X