అరేయ్ లఫూట్.. పవన్ కల్యాణ్‌కు అక్రమ వ్యాపారాలు లేవురా? బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు ఎత్తితే ఊగిపోయే బండ్ల గణేష్.. మరోసారి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకగా చెలరేగిపోయాడు. పవన్ వ్యక్తిత్వాన్ని, నిజాయితీ గురించి మాట్లాడుతూ తన అభిమానాన్ని చాటుకొన్నారు. బండ్ల గణేష్ స్చీచ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బండ్ల గణేస్ ఏమి మాట్లాడరంటే...

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... తారలతో వేడుక కళకళ.. ఎవరెవరూ వచ్చారంటే..

 బూడిదయ్యే వరకు అభిమానిగానే

బూడిదయ్యే వరకు అభిమానిగానే

ఈశ్వర.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. నిజంగా పవన్ కల్యాణ్ ఒక వ్యసనం. చనిపోయేదాకా.. బూడిదయ్యే వరకు వదులుకోలేం. కొన్ని జన్మలు అంతే.. కొందరిని ఇష్టపడటం తప్పితే వదులు కోవడం కష్టం. పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ గురించి ఏ మాట్లాడాలి.. ఆయన బ్లాక్‌బస్టర్లు చూడనివా? ఇండస్ట్రీ హిట్లా? ఆయన చూడని చరిత్రలా? సినిమా తర్వాత సినిమా చేస్తూ 12 వందల సినీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. కొత్త చరిత్ర నాంది పలికారు.. అని బండ్ల గణేష్ అన్నారు.

 పవన్ గురించి తప్పుడు కూత కూస్తే

పవన్ గురించి తప్పుడు కూత కూస్తే

ఈ మధ్య ఒకాయన పవన్ కల్యాణ్ గురించి తప్పుడు కూత కూశాడు. రాజకీయాలంటూ, సినిమాలు అంటూ కామెంట్ చేస్తూ.. మనలాగా కోళ్ల వ్యాపారం, పాల, సారా, విస్కీ, ఇటుక, ఇసుక వ్యాపారం లేవు. ఆయన తన రక్తాన్ని చెమటగా మార్చి తన నటనతో ఎన్నో సినీ కుటుంబాలను ఆదుకొంటారు. ఆయన నమ్ముకొన్నవారికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించిన వ్యక్తిరా లఫూట్ అని బండ్ల గణేష్ తెలిపారు.

 18 గంటలపాటు శ్రమిస్తూ

18 గంటలపాటు శ్రమిస్తూ

నా బాస్‌ను ఎవరైనా ఏమంటే నేను సహించను. రోజు 18 గంటలు పనిచేస్తూ 12 వందల మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ నిజాయితీ ఏమిటో తెలుసు. హీరోగారి దగ్గరకు వెళ్లి ఏదో మాటలు చెప్పి ఏమార్చారే ప్రయత్నాలు చేశాను. కానీ ఆయన కళ్లు చూస్తే అవన్నీ అలాంటివి వర్కవుట్ కావని అర్ధమైపోయింది అని బండ్ల గణేష్ అన్నారు.

 పవన్ కల్యాణ్‌కి భక్తుడిని

పవన్ కల్యాణ్‌కి భక్తుడిని

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం ఎవరికీ తెలియదు. ఆయనకు నేను భక్తుడిని. ఏడుకొండల స్వామికి అన్నమాచార్యుడు, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు. పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకొంటానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X